కరో్నా లాక్డౌన్ కారణంగా వలస కూలీలు పడిన కష్టాల గురించి తెలిసిందే. తమ స్వస్థాలకు చేరుకోవడానికి వందలాది కిలో మీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్లారు. ఈ విషయంపై పార్లమెంట్లో కేంద్రం స్పష్టత ఇచ్చింది.
నకిలీ వార్తలకు భయపడిన వలస కూలీలు తమ ఇళ్లకు కాలినడకన బయలుదేరారని కేంద్రం తెలిపింది. వలస కార్మికులు తమ ఇళ్లకు చేరుకోవడానికి వందలాది కిలోమీటర్లు ఎందుకు నడుస్తూ వెళ్లాల్సి వచ్చిందని తృణమూల్ సభ్యుడు మాలా ప్రశ్నించారు.
మరో ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు కూడా ఇదే విషయంపై ప్రశ్నించగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. నకిలీ వార్తలకు వలస కార్మికులు భయపడ్డారని, తమకు కనీస అవసరాలైన ఆహారం, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, వసతి దొరకవేమోనని ఆందోళన చెందారని రాయ్ చెప్పారు.
ఈ విషయంపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వ్యవహరించిందని పేర్కొన్నారు. ఆహారం, తాగు నీరు, వైద్య సదుపాయాల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు చేపట్టామని చెప్పారు. దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో కరోనా విస్తృత వ్యాప్తిని అడ్డుకున్నామని వివరించారు.

More Stories
పార్లమెంటుపై ఉగ్రదాడికి 24 ఏళ్లు
పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓట్ల తొలగింపు
గాలి నాణ్యతపై సొంతంగానే మార్గదర్శకాలు