2014 తర్వాత ఏపీలో దేవాలయాలకు రక్షణ లేదు 

ఆంధ్ర ప్రదేశ్ లో  హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుసదాదులకు నిరసనగా బీజేపీ పిలుపండుకొని బిజెపి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు జరిపారు. మాజీ మంత్రి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  గుంటూరులోని తన నివాసంలో నిరసన వ్యక్తంచేస్తూ 2014తర్వాత హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
.2014నుండి2019వరకు టీడీపీ హయాంలో దేవాలయాలు కులగొట్టారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అండతో మతమార్పిడి, డేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.  గుంటూరులో, పిట్టపురం, నెల్లూరు, ఉద్రజావారం, ప్రకాశం బ్యారేజీ వద్దకుడా, నెల్లూరు జిల్లాలో భూ అక్రమనలు, ఇప్పుడు అంతర్వేది నరసింహ స్వామి రధం దగ్ధం చేయడం దారుణమని విమర్శించారు. 
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతిస్థిమిటంలేని వారుచేసారని చేతులు దులుపుకోవడం అలవాటయిందని మండిపడ్డారు. చర్యలు తీసుకోకపోవడమే ప్రధాన కారణమని దుయ్యబట్టారు.దాడులకు గురైన వాటిని వెంటనే బాగుచేయలని డిమాండ్ చేశారు. అంతర్వేది ఘటనలో ఇంతవరకు అదుపులోకి తీసుకొని కపోవడమే ఒకనాటకమని ఆరోపించారు.
రాష్ట్రంలో పెద్ద దేవాలయాలను, చిన్న దేవాలయాలను వెంటనే హిందువులకు అప్పచెప్పాలని  కన్నా డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులు చేసిన వాటిని ఖండించడానికి వెళ్ళేవారిని అడ్డుకోవడం దారుణమని చెబుతూ ప్రతిఒక్క హిందువు ఈఘటనలను ఖండించాలని పిలుపునిచ్చారు.

విజయవాడలో జరిగిన నిరసనలో జిల్లా పరిషద్ మాజీ చైర్మన్, బీజేపీ నేత పాతూరి నాగభూషణం పాల్గొంటూ ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. 15నెలల కాలంలో ఒక మతానికి అనుకూలమైన పాలన సాగుతుందని ఆరోపించారు. 

వరుసగా ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటూ నిందితులను శిక్షించాల్సిన ప్రభుత్వమే మతి స్థిమితం లేని వారి పనిగా చెబుతోందని మండిపడ్డారు. దోషులను శిక్షించే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. 

రాష్ట్రం లో కుట్ర పూరితంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, కులం, మతం, ప్రాంతీయ‌ విబేధాలను‌ వైసీపీ ప్రోత్సహిస్తుందని నాగభూషణం ఆరోపించారు. 

మంత్రి వెల్లంపల్లి మతి లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి  మండిపడ్డారు.  కుల, మత రాజకీయాలు తమకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో కుల ప్రాస్తావన తెచ్చి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. 

వరుసగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం‌ చేస్తుందని నిలదీశారు. అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రభుత్వం ఆలయాలను కూలగొట్టారని చెబుతూ ఆనాడు వెల్లంపల్లి కూడా బీజేపీలోనే ఉన్నాడనే విషయం మరచి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 

వైసీపీ అధికారంలోకి‌ వచ్చాకే హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. సీఎం స్పందించి చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరతామని సత్యమూర్తి హెచ్చరించారు.