అనుమతుల కోసం రామ్ మందిర్ లేఅవుట్

అయోధ్యలో నిర్మించబడుతున్న రామ్ మందిర్ యొక్క లేఅవుట్.   దానికి సంబంధించిన ఇతర పత్రాలను ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీకి సమర్పించారు. అనిల్ మిశ్రా ఈ పత్రాలను శనివారం ఎడిఎ వైస్ చైర్మన్ మరియు కార్యదర్శి నీరజ్ శుక్లాకు అందజేశారు.

‘శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర యొక్క ధర్మకర్త డాక్టర్ అనిల్ మిశ్రా ఆలయానికి సంబంధించిన లేఅవుట్ మరియు ఇతర పత్రాలను ఆమోదం కోసం అయోధ్య అభివృద్ధి అథారిటీ వైస్ చైర్మన్ మరియు కార్యదర్శికి అందజేశారు. ఆమోదం పొందిన తరువాత నిర్మాణ పనులు ప్రారంభించవచ్చు’అని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్వీట్ చేసింది. 

అయితే ట్రస్ట్ గతంలోనే ఆగస్టు 20న రామ్ మందిర్ నిర్మాణం ప్రారంభమైందని తెలిపింది. ప్రస్తుతం రామ్ మందిర్ నిర్మించే స్థలంలో ఇంజనీర్లు మట్టిని పరీక్షిస్తున్నారు.

ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని పురాతన, సాంప్రదాయ నిర్మాణ పద్ధతులకు కట్టుబడి ఈ మందిరం నిర్మించబడుతుంది. భూకంపాలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మందిరం రూపుదిద్దుకుంటోంది. ఆగష్టు 5న జరిగిన రామ్ మందిర్ భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ  హాజరయ్యారు.