బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన రోజున  దుబాయ్ కంప్లైంట్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ సింగ్‌ను కలిశారని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి ఆరోపించారు. ఎందుకు కలిశారంటూ ట్వీట్ చేశారు.
అదే విధంగా, సునంద శవపరీక్ష చేసిన తర్వాత ఆమె కడుపులో వెలికి చూసిన వాటితోనే నిజం ఏంటనేది తెలిసింది. కానీ శ్రీదేవి, సుశాంత్ కేసులో ఇది జరగలేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. 
సుశాంత్ మృతితో దుబాయ్‌కు సంబంధాలు ఉండవచ్చని వారం రోజుల క్రితం స్వామి ఆరోపించారు. అంతేకాక సీబీఐ సుశాంత్ కేసుతో పాటు శ్రీదేవి సహా గతంలోని ఉన్నతస్థాయి వ్యక్తుల మరణాల కేసులను కూడా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్, యూఏఈ దౌత్య సంబంధాలతో, భారతదేశానికి చెందిన దుబాయ్ దాదాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెబుతూ సుశాంత్, శ్రీదేవి, సునంద హత్య కేసుల సమాచారం కోసం సీబీఐ మొసాద్, షిన్ బెత్ సహాయం తీసుకోవాలని స్వామి ఇదివరలో ట్వీట్ చేశారు.
శ్రీదేవి 2018 ఫిబ్రవరిలో దుబాయ్ హోటల్లోని బాత్‌టబ్‌లో మునిగిపోయి మరణించిన సంగతి తెలిసిందే. సునంద పుష్కర్ 2014 జనవరి 17న న్యూ ఢిల్లీలోని ఒక హోటల్ గదిలో అనుమానస్పద రీతిలో చనిపోయారు.
సుశాంత్ మృతి కేసు దర్యాప్తు కోసం గత వారం ముంబై చేరుకున్న సీబీఐ బృందం, నటుడి స్నేహితుడు సిద్ధార్థ్ పిథాతో పాటు నీరజ్ సింగ్‌ను సోమవారం మరోసారి ప్రశ్నించింది. ముంబైలోని శాంతక్రూజ్ ప్రాంతంలోని డీఆర్డీఓ గెస్ట్ హౌస్ వద్ద వీరిద్దరిని ప్రశ్నించారు.
అంతేకాక సీబీఐ అధికారులు ఈ రోజు సుశాంత్ రెండు నెలలు బస చేసిన వాటర్‌స్టోన్ రిసార్ట్‌ను కూడా సందర్శించారు. అక్కడ ఉన్న సమయంలో సుశాంత్ ఎలా ప్రవర్తించాడో తెలుసుకోవడానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
                            
                        
	                    
More Stories
లక్నో వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు
భారత్‌లోనే నిఫా నిరోధక ‘యాంటీబాడీస్’ తయారీ
ఢిల్లీలో వాయు కాలుష్యం.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు