క్రమశిక్షణా చర్యల కింద ఉత్తరాఖండ్ బీజేపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన డెహ్రాడూన్లో రాష్ట్ర నాయకత్వం ముందు హాజరై సమాధానం చెప్పుకోవాల్సిందిగా పేర్కొంది.
ఎమ్మెల్యేలు కునర్వ్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్, దేశరాజ్ కర్నావాల్, పూరన్ సింగ్ ఫర్తాల్, మహేష్ నేగిలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బన్సీధర్ భగత్ ఆదేశాల మేరకు సమన్లు జారీ చేసినట్లు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు దేవేంద్ర భాసిన్ తెలిపారు. ఈ నలుగురిలో ఇద్దరు ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకున్నారు, మరో ఇద్దరు పార్టీ క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ఎమ్మెల్యే మహేష్ నేగి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణ. ఎమ్మెల్యే కునర్వ్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్ ఓ పార్టీలో గన్స్ పట్టుకుని డాన్స్ వేయడంతో వీడియో వైరల్ అయింది. మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఆరోపణలపై సమన్లు జారీ అయ్యాయి.

More Stories
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ
లింగ నిష్పత్తిలో కేరళ ఆదర్శవంతం
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం