
మధ్యప్రదేశ్ బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం కరోనా బారిన పడింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా సోకడంతో ఆయన ప్రభుత్వాసుపత్రిలో వైద్యం తీసుకున్న విషయం తెలిసిందే. ఈయనతో పాటు మరో ఇద్దరు అగ్రనేతలు కూడా కరోనా బారిన పడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ వీడీ శర్మకు కరోనా సోకగా, సంఘటన ప్రధాన కార్యదర్శి సుహాస్ భగత్ కూడా కరోనా బారినపడ్డారు. ఇలా అగ్రనేతలుగా ఉన్న వీరు ముగ్గురూ కరోనా బాధితులే. సంఘటనా కార్యదర్శి సుహాస్ భగత్‌కు మంగళవారం అర్ధరాత్రి కరోనా అని తేలింది. దీంతో ఆయన స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు.
ఇక, బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ సీఎం చౌహాన్ చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే ఆయన కూడా చికిత్స పొందుతున్నారు. ఇక మంత్రుల పరంగా చూసుకుంటే ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. మొదటి వారు అరవింద్ బధోరియా కాగా, రెండో వారు నీటిపారుదల మంత్రి తులసీ సిలావత్. ఈ ఇద్దరు మంత్రులకూ కరోనా సోకింది.
More Stories
విభజన దశలో బలి అయిన వారికి ప్రధాని నివాళి
ప్రతి పౌరుడి నిత్య జీవనం ఆత్మనిర్భర్ కావాలి
కాలపరీక్షల నడుమ భారతదేశం సాధించిన ఘనతలు ఎనలేనివి