బలపరీక్షకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను శనివారంనాడు అశోక్ గెహ్లాట్ కలుసుకుని, తమ పార్టీకి ఇద్దరు భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు లేఖలను అందజేసిన నేపథ్యంలో బలపరీక్షకు గెహ్లాట్ సిద్ధమవుతున్న సంకేతాలు వెలువడ్డాయి.
గవర్నర్, ముఖ్యమంత్రి సుమారు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారని, ఈ సమావేశంలో కరోనాపై పోరాటానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గెహ్లాట్ వివరించారని రాజ్‌భవన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే సమయంలో, తమ ప్రభుత్వానికి బీటీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు లేఖల గురించి తెలియజేసి తమకు పూర్తి మెజారిటీ ఉన్న విషయాన్ని వివరించినట్టు తెలుస్తోంది.
రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండాలనే షరతుతో గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ అధ్యక్షుడు, ఇతర నేతలు అంగీకిరించినట్టు బీటీపీ శాసనసభ్యులు రాజ్‌కుమార్ రోయత్, రామ్ ప్రసాద్ మీడియాకు తెలిపారు.
అనర్హత నోటీసులపై తిరుగుబాటు నేత సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్ ను హై కోర్ట్ ముందుకు మంగళవారం రానున్నది. అందుకనే కోర్ట్ లో ఏమి జరుగుతుంది చూసి, మరుసటి రోజు బలపరీక్షకు సిద్ధపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అంతర్గత కలహాలతో తాము జోక్యం చేసుకోమని సంకేతం బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఇవ్వడం గమనార్హం.
More Stories
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్
ఉత్కంఠ పోరులో పాక్ పై భారత్ జయకేతనం