తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
పీవీ పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్రాన్ని కోరతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం త్వరలో పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తుందని సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టతనిచ్చారు.
‘పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంతో పాటు ఆయన సేవలను గుర్తించట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తన తప్పును తెలుసుకొని, మాజీ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపునిచ్చి ఆ తప్పును సరిదిద్దుకుంటుందని భావిస్తున్నానని, దేశం గర్వించదగ్గనేత పీవీ’ అని ఆయన పేర్కొన్నారు.

More Stories
‘రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ పోస్టర్ ఆవిష్కరణ
కేశవ నిలయంలో “పంచ పరివర్తన్”పై ఏఐలో కార్యశాల
తెలంగాణాలో మంత్రులు సహా వందల వాట్సాప్ గ్రూపుల హ్యాక్