ఐటీ రిటర్నులకు గడువు జులై 31 

ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం పొడిగించింది. 2018–19, 2019–20 సంవత్సరాలకు సంబంధించి గడువును జులై 31 వరకు పెంచింది. ఈ మేరకు  సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్ట్​ టాక్సెస్ (సీబీడీటీ) ప్రకటన చేసింది. 
 
2018–19 ఏడాదికి గాను రివైజ్డ్​ రిటర్న్స్ ఫైల్​ చేయడానికి డెడ్​లైన్ ఈ నెలాఖరుతో ముగియనుండగా దాన్ని జులై 31 కి పెంచింది. టాక్స్ ఆడిట్​ రిపోర్ట్​ అందజేయడానికి గడువును అక్టోబర్​ 31కి పెంచింది. 
 
20‌‌19–20 ఆర్ధిక సంవత్సరానికి గాను వివిధ డిడక్షన్లు క్లెయిమ్ కు  ఇన్వెస్ట్​మెంట్​ డెడ్​లైన్​ను కూడా సెప్టెంబర్​ 30 దాకా పెంచింది.  మరోవైపు, పాన్​ కార్డును ఆధార్​కార్డుతో లింక్​ చేసుకునేందుకు ఇప్పుడున్న గడువును వచ్చే ఏడాది మార్చి 31 దాకా పొడిగిస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది.