ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం పొడిగించింది. 2018–19, 2019–20 సంవత్సరాలకు సంబంధించి గడువును జులై 31 వరకు పెంచింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ప్రకటన చేసింది.
2018–19 ఏడాదికి గాను రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి డెడ్‌లైన్ ఈ నెలాఖరుతో ముగియనుండగా దాన్ని జులై 31 కి పెంచింది. టాక్స్ ఆడిట్ రిపోర్ట్ అందజేయడానికి గడువును అక్టోబర్ 31కి పెంచింది.
2019–20 ఆర్ధిక సంవత్సరానికి గాను వివిధ డిడక్షన్లు క్లెయిమ్ కు ఇన్వెస్ట్మెంట్ డెడ్‌లైన్‌ను కూడా సెప్టెంబర్ 30 దాకా పెంచింది. మరోవైపు, పాన్ కార్డును ఆధార్‌కార్డుతో లింక్ చేసుకునేందుకు ఇప్పుడున్న గడువును వచ్చే ఏడాది మార్చి 31 దాకా పొడిగిస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది.

More Stories
చైనా వెళ్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్ భారత్‌కు మల్లింపు
మారుతి సుజుకికి ఐటీ శాఖ నోటీసులు
ఎల్పీజీ గ్యాస్.. పెట్రోల్, డీజిల్‌కూ కొరత లేదు