చైనాతో పోటీ పడతారా, సహకరిస్తారా తేల్చుకోండి!

విస్తరణవాదంతో దురాక్రమణకు పోటీ పడుతున్న చైనాతో పోటీపడి ఎదుర్కొంటారా లేదా సహకారం పేరుతో ఆ దేశం ఎత్తుగడలకు లొంగిపోతారో భారతీయులు తేల్చుకోవాలని కేంద్ర టిబెట్ పాలనా యంత్రాంగం అధ్యక్షుడు, టిబెట్ మత గురువు దలైలామా రాజకీయ వారసుడు డా. లోబ్ సన్గ్ సంగాయ్ భారతీయులకు పిలుపిచ్చారు.

“భారత్ – టిబెట్ – చైనా : ప్రపంచ శాంతికి సమాహారం” అంశంపై భారత్ ఛాంబర్ అఫ్ కామర్స్, ఫ్రెండ్స్ అఫ్ టిబెట్ సొసైటీ, భారత్ టిబెట్ సెహయోగ్ మంచి ల ఆధ్యర్మలో జరిగిన ప్రత్యేక వెబినార్ లో మాట్లాడుతూ చైనా ముందు శాంతివచనాలు పలికి, ఆ తర్వాత టిబెట్ ను ఆక్రమించుకున్నట్లు ఇతర ప్రాంతాలను కూడా ఆక్రమించు కొంటుందని ఆయన హెచ్చరించారు.

ఇప్పుడు లడఖ్, సిక్కిం, నేపాల్, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ లను ఆక్రమించు కోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ మధ్య గాల్వన్ వ్యాలీలో 20 మంది భారతీయ సైనికులను చైనా సేనలు విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ 1962లో కూడా చైనా ఇక్కడి నుండే భారత్ పై దాడి చేసి, విశాలమైన భారత భూభాగాలను ఆక్రమించినదని గుర్తు చేశారు.

చారిత్రాత్మకంగా టిబెట్ భారత్, చైనాల మధ్య బఫర్ జోన్ గా ఉండేదని, శాంతికి మారుపేరని గుర్తు చేశారు. అటువంటి సమయంలో భారత సరిహద్దుల్లో సైనికుల అవసరం కూడా ఉండెడిది కాదని చెప్పారు. అయితే టిబెట్ ను చైనా ఆక్రమించిన తర్వాత చైనా సేనలు భారత్ సరిహద్దుల వరకు వచ్చాయని పేర్కొన్నారు. 

1954లో భారత్ – చైనాల మధ్య కుదిరిన పంచశీల ఒప్పందం ప్రాధమికంగా టిబెట్ లో శాంతి, వాణిజ్యంకు సంబంధించినదని చెబుతూ టిబెట్ లో శాంతి నెలకొల్పడానికి, టిబెట్ ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవడానికి, ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కలిగించడానికి చైనా అంగీకరించిందని సంగాయ్ గుర్తు చేశారు. 

పంచశీల 25 ఏళ్లపాటు అమలులో ఉండాలి అంటే, చైనా ఐదేళ్లు మాత్రమే అని స్పష్టం చేసినదాని, చివరకు 8 ఏళ్లకు ఒప్పుకున్నదని చెబుతూ ఐదేళ్లకు టిబెట్ ను చైనా ఆక్రమించినదని గుర్తు చేస్తూ, 8 ఏళ్లకు భారత్ పై యుద్ధం చేసి, భారత్ భూభాగాలను ఆక్రమించినదని తెలిపారు. చైనా కుట్రలో భాగమే పంచశీల అని ఆరోపించారు. 

1959లో టిబెట్ ను బలవంతంగా ఆకర్మయంచుకొని, 87,00 మంది ప్రజలను చంపి వేసినదని పేర్కొన్నారు. ఆసియాలోనే ముఖ్యమైన 10 నదులు టిబెట్ లో ఉన్నాయని, ఇప్పుడు అవ్వన్నీ చైనా సేనల ఆధీనంలో ఉన్నాయని చెప్పారు. అపారమైన టిబెట్  ఖనిజ వనరులను చైనా కంపెనీలు దోచుకొంటున్నాయని విమర్శించారు. 

చైనా ముందుగా ఒక దేశంలో శాంతి పేరుతో చేరి,  అక్కడ గల రాజకీయ, ధార్మిక, వాణిజ్య, ఇతర ప్రముఖులు, మీడియా ను కొనివేస్తుందని. చివరకు తమ విస్తరణ వాదాన్ని వారు సమర్ధించే విధంగా చేసుకొంటుందని చెబుతూ భారత్ లో కూడా అదే విధంగా చేసిందని గుర్తు చేశారు. 

ప్రస్తుతం చైనా చూపుతున్న మ్యాప్ లో కేవలం 43 శాతం మాత్రమే చైనాకు చెందినదని, మిగిలిన ప్రాంతాలు అన్ని ఆక్రమించుకున్నవే అని పేర్కొన్నారు. నేడు టిబెట్ విషయంలో చైనాను నిలదీయగల హక్కు భారత్ కు మాత్రమే ఉన్నదని స్పష్టం చేశారు. ఎందుకంటె శాంతియుత టిబెట్ విముక్తి కోసం చైనా భారత్ కు హామీ ఇచ్చినది తెలిపారు. 

భౌగోలిక, రాజకీయ, వాణిజ్య, ఆధ్యాత్మిక పరంగా టిబెట్, భారత్ ప్రజలు చాలా సామీప్యం గలవారిని అంటూ టిబెట్ చారిత్రక పరిణామాలను భారతీయులు తెలుసుకోవలసిందే అని స్పష్టం చేశారు. భారత్, అంతర్జాతీయ సహకారంతో టిబెట్ శాంతియుత జోన్ గా పునరుద్ధరిస్తామని భరోసా వ్యక్తం చేశారు.

దలైలమై వారసుడిని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నీయమిస్తుందని వార్తలను ఎద్దేవా చేస్తూ శంకరాచార్యను సిపిఎం నేత సీతారాం ఏచూరి నియమిస్తే హిందువులు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.