
ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. కశ్మీర్ నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించారని నిఘావర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి.
దీంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఢిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, గెస్ట్ హౌజ్ ల వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అతిథిగృహాలు, ఇతర ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రద్దీగా ఉండే మార్కెట్లు, దవాఖానలపై ప్రత్యేక నిఘా ఉంచామని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా భారత్, చైనా మధ్య నెలకొన్న ఘర్షణతో ఇప్పటికే దేశంలోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెట్టిన విషయం తెలిసిందే.
More Stories
మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు, డిజిపిపై వేటు
పార్లమెంట్ భవనం ప్రారంభం బహిష్కరించి దేశాన్ని అవమానించారు
మయన్మార్ నుండి వివిధ తెగల వలసలపై అమిత్ షా దృష్టి