
చైనాపై దేశంలో పెరుగుతున్న ఆగ్రవేశాలు హైదరాబాద్ కు కూడా తాకాయి. నగరంలో అత్యంత కీలకమైన బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, ఫీల్ఖానా హోల్సేల్ వ్యాపారస్తులు ఇకపై చైనా ఉత్పత్తులను ఏమాత్రం విక్రయించరాదని కీలక నిర్ణయం తీసుకున్నారు.
గాల్వాన్ లోయలో భారత్ చైనా జవాన్ల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందడంతో హైదరాబాదీ వ్యాపారులు ఇంతటి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, ఫీల్ఖానా ప్రాంతాల్లోని హోల్సేల్ వ్యాపారులు సమావేశమయ్యారు.
మరోవంక, గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇకపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచాలని స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకున్నారు. ఇలా చేయడం ద్వారా కరోనా కట్టడిలో తమవంతు పాత్రను పోషించిన వారమవుతామని వారు ప్రకటించారు.
హైదరాబాద్ సిటీలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇకపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచాలని స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకున్నారు.
ఇలా చేయడం ద్వారా కరోనా కట్టడిలో తమవంతు పాత్రను పోషించిన వారమవుతామని వారు ప్రకటించారు. మరోవైపు చైనా వస్తువులను బహిష్కరించాల్సిందేనని దేశవ్యాప్త డిమాండ్ ఉద్ధృతంగా తిరిగి ప్రచారంలోకి వచ్చింది.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి