
అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్నా గ్రామీణ ప్రాంతాల రక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గ్రీన్ రివల్యూషన్ పితామహుడు, ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అందించిన సేవలకు గౌరవంగా ఆయన శతజయంతి నేపథ్యంలో ఢిల్లీలోని ఐసీఏఆర్ పూసాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటూ స్వామినాథన్ జీవితం అంతా అందరికీ ఆహారం అందించాలన్న ఆయన అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
దిగవంగత ఎంఎస్ స్వామినాథన్ ఆహార భద్రతను తన జీవిత ధ్యేయంగా చేసుకున్నారని, వ్యవసాయ శాస్త్రంలో చేసిన కృషికి ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు. రైతుల ప్రయోజనాలే భారతదేశానికి అత్యంత ప్రాధాన్యత అని, రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాల విఝయంలో భారత్ ఎప్పుడూ రాజీపడబోదని స్పష్టం చేశారు.
ఒకే కాలానికి పరిమితం కాదని కొందరు వ్యక్తులు ఉన్నారని, ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథ్ అలాంటి గొప్ప వ్యక్తని పేర్కొంటూ ఆయన భూభారతి కుమారుడని కొనియాడారు. ఆయన సైన్స్‌ను ప్రజాసేవకు మాధ్యమంగా మార్చారని, రాబోయే శతాబ్దాల పాటు భారత దేశ విధానాలు, ప్రాధాన్యతలను మార్గనిర్దేశం చేసే చైతన్యాన్ని ఆయన మేల్కొల్పారని తెలిపారు.
ఈ సందర్భంగా స్వామినాథ్ గౌరవార్థం స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను ఆయన ఆవిష్కరించారు ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవమని చెబుతూ గత పదేళ్లలో దేశవ్యాప్తంగా చేనేత గుర్తింపు, బలాన్ని పొందిందని ప్రధాని చెప్పారు. ప్రొఫెసర్ స్వామినాథన్‌తో తనకు చాలా అనుబంధం ఉందని, తాను సీఎంగా ఉన్న సమయంలో సాయిల్ హెల్త్ కార్డ్ పథకంపై ఇద్దరం కలిసి పని చేశామని,. ప్రొఫెసర్ స్వామినాథన్ దానిపై చాలా ఆసక్తి చూపించారని గుర్తు చేసుకున్నారు.
ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, వ్యవసాయం-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ సహకారంతో ఈ మూడు రోజుల సదస్సు జరుగుతుంది.
More Stories
స్వదేశీ ఉత్పత్తులే కొనండి, అమ్మండి, వినియోగించండి
నవంబర్ 5 నుంచి 15 వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు!
ఎల్టీటీఈ పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నం