
బనకచర్ల లింక్ ప్రాజెక్టును గోదావరి బేసిన్‌లోని పోలవరం నుంచి చేపడుతున్నారని, కృష్ణా నదికి జలాలను మళ్లించి, తుదకు పెన్నా బేసిన్ కు తరలించనున్నారని వివరించింది. అయితే, గోదావరి జలాల మళ్లింపుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యాలు పూర్తిగా మారిపోతాయని వెల్లడించింది. గోదావరి బనకచర్ల లింక్ చేపడితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు, ప్రస్తుతం ప్రతిపాదించిన పనులకు ఏమాత్రం పొంతన ఉండబోదని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా డిజైన్లతోపాటు కాలువ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా మార్చాల్సి ఉంటుందని తెలిపింది.
ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టును చేపట్టాలంటే మరోసారి టీఏసీ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని, అందుకు బేసిన్‌లోని అన్ని రాష్ర్టాల సమ్మతి తప్పనిసరి అని, ఆయా రాష్ర్టాలతో చర్చించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లిస్తే, ఆ మళ్లించే జలాల్లో కృష్ణా బేసిన్‌లోని రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని, ఈ మేరకు బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా తెలియజేసిందని కేఆర్‌ఎంబీ గుర్తుచేసింది.
ఇదిలావుండగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సైతం సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. ఏపీ సమర్పించిన పీఎఫ్‌ఆర్‌లోని అనేక అంశాలపై సందేహాలను, సాంకేతికపరమైన అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ప్రాజెక్టుకు అనుమతులివ్వకూడదని పరోక్షంగా సూచించింది.
More Stories
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా
ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!
అంతర్వేది తీరంలో సముద్రం వెనుకంజ