
బీసీ రిజర్వేషన్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు ఏ మాత్రం ముప్పు లేకుండా, అదనంగా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని రామచందర్ రావు గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం కేబినెట్లో 27% మంది బీసీ మంత్రులు ఉన్నారని ముఖ్యమంత్రులతో కూడా బిసీలకు పెద్దపీట వేసిన ఘనత మోదీ గారిదే అని స్పష్టం చేశారు. బీసీ కమిషన్ను తీసుకువచ్చింది కూడా మోదీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన విషయానికొస్తే, అది రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ కాదని, ఆ గణన కేవలం గణాంకాల సేకరణ మాత్రమే అని బిజెపి నేత తెలిపారు. ఎందుకంటే, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థల ద్వారా కాకుండా, ప్రభుత్వమే స్వయంగా నిర్వహించిన ప్రక్రియ అని చెప్పారు. కులగణనకు సంబంధించి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
మండలాల స్థాయిలో కులగణన చేయలేదని అనేకమంది టీచర్లు చెబుతున్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వివరాలను బయటపెట్టే ఉద్దేశం కనబడడం లేదని విమర్శించారు. కులగణనను అధికారికంగా చేయాలంటే, అది రాజ్యాంగబద్ధమైన సంస్థలతో, సరైన డేటా ద్వారా చేయాల్సి ఉంటుందని తెలిపారు. బిజెపి కులగణనకు వ్యతిరేకం కాదని, కానీ అది శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా జరగాలని స్పష్టం చేశారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రేపు జరగబోయే జనాభా గణనలో కులగణనను అధికారికంగా తీసుకురాబోతున్నదని చెప్పారు. అధికారికంగా జనగణనలో భాగంగా కులగణనను చేర్చడం వల్ల దేశంలోని వివిధ సామాజిక వర్గాల గణాంకాలు స్పష్టంగా వెలుగులోకి రానున్నాయని తెలిపారు.
More Stories
కోల్కతాలో భారీ వర్షం… విద్యుత్ షాక్ లకు 9 మంది మృతి
మల్లోజుల వేణుగోపాల్ ద్రోహి.. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం దక్షిణ తెలంగాణకు శాపం!