
ప్రభుత్వ ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు ఈ కారణంతో సెలవు తీసుకునేందుకు ఏమైనా అవకాశాలున్నాయా? అని ఎంపీ సుమిత్రా బాల్మిక్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు, 1972 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి 30 రోజుల సెలవుల్లో 20 రోజులు హాఫ్ పే లీవ్స్, 8 రోజుల క్యాజువల్ లీవ్స్, 2 రోజుల పరిమిత సెలవులతో పాటు ఇతర అర్హత గల సెలవులు ఉంటాయి.
ఆయా సెలవులను ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం తదితర వ్యక్తిగత కారణాల కోసం తీసుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. సదరు ఉద్యోగి సెలవులు ఎందుకు పెట్టారని అడిగితే వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకని స్పష్టంగా పేర్కొనవచ్చు. అయితే, ఇవేమీ కొత్తగా ఇచ్చే సెలవులేమి కాకపోయినా వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు సైతం సెలవులు తీసుకునే అవకాశం ఉందని చెప్పడం కొత్త విషయం.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!