
ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల నుండి 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంలో భాగంగా కాలపరిమితికి దగ్గరగా ఉన్న పాత థర్మల్ విద్యుత్ ప్లాంట్లను అణు విద్యుత్ యూనిట్లుగా మార్పు చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2032 నాటికి మొదట 22 గిగావాట్ల అణు విద్యుత్ సామర్త్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంధన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 484.82 గిగావాట్లుగా ఉంది. వీటిలో 184.62 గిగావాట్ల పునరుత్పాదక శక్తి, 49.38 గిగావాట్ల పెద్ద జల విద్యుత్, 8.78 గిగావాట్ల సామర్థ్యం కలిగిన అణు విద్యుత్ ఉత్పత్త ప్రాజెక్టులు ఉండగా, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి శిలాజ అధారిత ఉష్ణ విద్యుత్ కు సంబంధించి 242.04 గిగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో 2047 నాటికి దేశంలో 10 పాత థర్మల్ ప్లాంట్లను అణు విద్యుత్ యూనిట్లుగా మార్చనుంది. విద్యుత్ యూనిట్లలో తిరిగి ఉపయోగించేందుకు వివిధ ప్రాంతాల్లోని 10 పాత లేదా రిటైర్డ్ థర్మల్ విద్యుత్ కేంద్రాలను గుర్తించింది. వీటిని తనిఖీ చేసి ప్రాథమికంగా విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై భారత అణు విద్యుత్ సంస్థ సభ్యులతో కూడిన సైట్ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ గుర్తించిన ఆయా ప్రదేశాలను తనిఖీల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు