
అప్పగింత ఘట్టం పూర్తి అయ్యాక ఈ నౌక తూర్పు నౌకాదళ కమాండ్‌లో భాగమవుతుంది. సముద్ర జలాల్లో బాగా లోతైన ప్రాంతాల్లో అవసరమైన సహాయాన్ని చేయడంతో పాటు, జలాంతర్గామి రక్షణకు సంబంధించిన కార్యకలాపాల్లో ఈ డీఎస్‌వీ కొండంత అండగా ఉంటుంది. రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులలో ‘ఆత్మనిర్భరత’పై దృష్టి పెట్టి, దేశ నిర్మాణంపై అమిత శ్రద్ధ తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ నౌక ఒక నిదర్శనం.
సంకల్పం, మునుపెన్నడూ
ఇంతకు పూర్వం ‘నిస్తార్’ తరహా నౌక జలాంతర్గామి రక్షక నౌకగా మాత్రమే. దీనిని 1969లో అప్పటి యూఎస్ఎస్ఆర్ వద్ద నుంచి భారతీయ నౌకాదళం కొనుగోలు చేసింది. 1971లో జలప్రవేశం జరిగింది. ఈ నౌక తన రెండు దశాబ్దాల సేవా కాలంలో, భారతీయ నౌకాదళానికి సముద్ర జలాల అడుగున అవసరమైన కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు జలాంతర్గాములను ఆపత్కర స్థితుల్లో నుంచి కాపాడేందుకు సంబంధించిన పనుల్లో గొప్ప తోడ్పాటును అందించింది.
ఈ నౌక జలప్రవేశం పూర్తయితే, ‘సురక్షిత యథార్థ శౌర్యం’ అనే తన వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ‘సురక్షిత యథార్థ శౌర్యం’ అనే మాటలకు.. అప్పగించిన పనిని ఖచ్చితత్వంతోనూ, ధైర్య సాహసాలతోనూ పూర్తి చేయడం.. అని అర్థం. ఈ ఆదర్శ వాక్యం ఈ నౌక ప్రధాన విధుల్ని ప్రతిఫలిస్తుంది. దాదాపు 120 మీటర్ల పొడవు, 10,000 టన్నుల బరువుతో పాటు డీఎస్‌వీలో డైనమిక్ పొజిషనింగ్ సిస్టమ్‌ను అమర్చినందు వల్ల ఇది అత్యంత ఖచ్చితత్వంతో తనుండే స్థానాన్ని నిలబెట్టుకోగలిగే సామర్ధ్యాన్ని పొందింది.
ఈ నౌకలో విశాలమైన డైవింగ్ కాంప్లెక్స్ అందుబాటులో ఉంటుంది. దీనిలో ఎయిర్, శాచురేషన్ డైవింగ్ సిస్టమ్ కూడా ఉంది. వీటితో పాటు జలాల అడుగున రిమోట్‌తో పని చేయగల వెహికిల్స్ (ఆర్‌ఓవీస్), సైడ్ స్కాన్ సోనార్‌ను కూడా అమర్చారు. ఇవి నౌక కార్యకలాపాల పరిధిని పెంచాయి. బాగా లోతు జలాల్లో విధులు నిర్వర్తించే రక్షక వెహికిల్ (డీఆర్‌వీ)కి ‘తల్లి నౌక’గా కూడా వ్యవహరించగలదీ నౌక.
దీనిని విధుల్లో చేర్చుకోనుండడం ఆపద బారిన పడ్డ జలాంతర్గాములను రక్షించడంలో భారతీయ నౌకాదళ సన్నద్ధతను చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపరచనుంది. ఈ నౌకలో ఆపరేషన్ థియేటర్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఎనిమిది పడకల ఆసుపత్రి వీటితో పాటు హైపర్ బేరిక్ వైద్యచికిత్స సదుపాయాలను కూడా జోడించారు. ఇవి ఈ నౌకకు అప్పగించిన విధుల నిర్వహణలో చాలా ముఖ్య పాత్రను పోషించనున్నాయి.
సముద్రంలో 60 రోజుల కన్నా ఎక్కువ సమయం వరకు కార్యరంగంలో నిలిచి ఉండగల సామర్థ్యాన్ని, హెలీకాప్టర్ సాయంతో కీలక కార్యకలాపాలను చేపట్టగలిగే సదుపాయాన్ని స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెసల్‌కు జతపరిచారు. సముద్ర జలాల్లోపల సేవలందించగల 15 టన్నుల క్రేన్ కూడా ఉన్న ఈ నౌక ఎంతో ఉపయుక్తంగా మారే బహుముఖీన వేదిక కాబోతోంది.
నిస్తార్ జలప్రవేశానంతరం అది భారతీయ నౌకాదళ ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో చేరడంతో, సముద్ర జలాంతర్భాగంలో భారత్ సైన్య బలం పెరగనుంది. అంతేకాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో దీని వ్యూహాత్మక నౌకా వాణిజ్య సత్తా ఇదివరకటి కన్నా మరింత శక్తిమంతం అవుతుంది.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ