ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఓ అరుదైన అనుభవాన్ని పొందాయి. బ్రిటన్ రాజు చార్లెస్-3ని వారు మర్యాదపూర్వకంగా కలసి, అతని సాన్నిధ్యంలో గడిపారు. మంగళవారం నాడు క్లారెన్స్ హౌస్ గార్డెన్‌లో ఈ సమావేశం జరిగింది.పురుషుల జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బుమ్రా, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లు రాజుతో కలసి గ్రూప్ ఫొటో దిగారు.
ఈ సందర్భంగా చార్లెస్ మిత్రుడిలా మాట్లాడుతూ పలువురు ఆటగాళ్లతో నవ్వులు పంచుకున్నారు. మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కూడా రాజు స్నేహపూర్వకంగా సంభాషించారు. తాజాగా లార్డ్స్‌లో జరిగిన మూడో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌ను కింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ మ్యాచ్ హైలైట్స్ చూశానని, చివరి బ్యాటర్ అలా అవుట్ కావడం ఎలా అనిపించింది? అని ప్రశ్నించారు. దీనికి శుభ్‌మన్ గిల్“చాలా బాధాకరమైంది. కానీ వచ్చే రెండు మ్యాచ్‌లపై ఆశలు ఉన్నాయ్ అని సమాధానమిచ్చారు.
షోయబ్ బషీర్ బౌలింగ్ లో బంతి స్టంప్స్ కు తగిలి చివరి ఆటగాడు మహ్మద్ సిరాజ్ అవుట్ కావడంతో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయిందని కింగ్ పేర్కొన్నారు. రాజుతో మాట్లాడిన అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ తన అనుభవాన్ని పంచుకుంటూ, “చార్లెస్ ఎంతో అనురాగంగా, ఆత్మీయంగా మాట్లాడారు. ఇది మర్చిపోలేని క్షణం” అని చెప్పారు. ఆటగాళ్లందరికీ ఇది గుర్తుండిపోయే సంఘటనగా మారిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శుభమన్ గిల్ మాట్లాడుతూ, “కింగ్ చార్లెస్ IIIని కలవడం నిజంగా గొప్ప అనుభవం. ఆయన మమ్మల్ని ఆత్మీయంగా ఆహ్వానించారు. టెస్ట్ మ్యాచ్ గురించి కూడా విశేషంగా మాట్లాడారు. ఆ మ్యాచ్‌లో చివరి వికెట్ దురదృష్టవశాత్తూ పడింది అని గుర్తు చేశారు. ఇది మాకు కూడా తక్కువ దూరంలో చేజారిపోయిన విజయం అని ఆయనతో పంచుకున్నాం. వచ్చే రెండు మ్యాచ్‌ల్లో మేము పూర్ణంగా రాణిస్తామన్న నమ్మకం ఉందని చెప్పాం” అని తెలిపారు.
ఆ మ్యాచ్‌లో భారత్ చివరి రోజు 58/4తో ఇన్నింగ్స్ కొనసాగించింది. ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించి త్వరగా వికెట్లు తీసినప్పటికీ, రవీంద్ర జడేజా అద్భుతంగా పోరాడాడు. జడేజా 181 బంతుల్లో 61 (నాటౌట్), నితీష్ రెడ్డి (30), జస్ప్రీత్ బుమ్రా (35), మొహమ్మద్ సిరాజ్ (23)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కానీ చివరి వరకు భారత్ ఆత్మస్థైర్యంగా పోరాడినప్పటికీ 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయి, విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది.
More Stories
ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫెల్ పై చైనా అసత్య ప్రచారం
భారత్‌లో భారీ దాడులకు జైషే విరాళాల సేకరణ
బంగ్లాదేశ్ నిరసనలకు నిధులిచ్చిన బిడెన్ ప్రభుత్వం