
తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా సర్కారు నిర్ణయంతో రాజ్‌భవన్‌కు చేరింది. పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్-ఎ సవరించాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే 285 క్లాజ్-ఎ సెక్షన్‌లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా అమలవుతాయని ఉంది. అందులో 50 శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగిస్తూ చట్టాన్ని సవరించాలని నిర్ణయించారు. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు (సెప్టెంబర్ 30) సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (ఏ)కు సవరణ చేసేందుకు వీలుగా ఆర్డినెన్స్ ముసాయిదాను సిద్ధం చేసి పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యమంత్రి అనుమతితో గవర్నర్‌కు ప్రభుత్వం పంపించింది. ఈ ముసాయిదా ఆమోదం పొందిన వెంటనే 42 శాతం రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో అమలు చేసేందుకు వీలు కల్పిస్తూ జీవో జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
వారం, పది రోజుల్లో ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఆమోదం, తర్వాత బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లను నిర్ణయించడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే.
ఇదిలావుంటే ఆర్డినెన్స్‌కు ఎంత వరకు ఆమోదం లభిస్తుందని రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి వద్ద రిజర్వేషన్ బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలియజేస్తారా?లేదా అనే అంశంపై న్యాయకోవిదుల మధ్య ప్రస్తుతం చర్చజరుగుతోంది. ఒక వైపు ఆర్డినెన్స్‌తో గట్టెక్కాలనే ప్రభుత్వ వ్యూహం ఎంత వరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాల్సి ఉంది. ప్రభుత్వం రిజర్వేషన్ల ఖరారుతో జివో జారీ చేసిన వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉంటుంది.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి