
టెస్టు క్రికెట్‌లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. విదేశీ గడ్డపై ఒక టెస్టు సిరీస్ (కనీసం 3 మ్యాచ్‌లు) లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్స్‌లు బాదిన టీమిండియ ఈ అరుదైన ఫీట్‌ను తమ పేరిట లిఖించుకుంది.
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ 34 సిక్సర్లు నమోదు చేసింది.
ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్, న్యూజిలాండ్ పేరిట సంయుక్తంగా ఉండేది. 1974లో వెస్టిండీస్ జట్టు భారత్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 32 సిక్సర్లు నమోదు చేసింది. ఆ తర్వాత 2014లో యూఏఈ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కివీస్ కూడా సరిగ్గా 32 సిక్సర్లు కొట్టింది. తాజా మ్యాచ్‌తో కివీస్, విండీస్‌ను భారత్ అధిగమించింది.
ఇక లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి 387 పరుగులు చేసింది. బదులుగా భారత్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో చేసి 387 పరుగులే చేయగలిగింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల స్కోరు సమం అయింది. నాలుగో రోజు ఆట ఇరు జట్లకు కీలకం కానుంది. భారత బౌలర్లు మెరుగ్గా రాణించి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేస్తే మరో విజయం తమ ఖాతాలో వేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
మరోవంక, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (72 పరుగులు) హాఫ్ సెంచరీతో మూడో రోజు టీమ్ఇండియా బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. తాజా హాఫ్ సెంచరీతో జడేజా డబ్ల్యూటీసీ టోర్నీల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. డబ్ల్యూటీసీలో జడేజాకు ఇది 15వ హాఫ్ సెంచరీ. అటు బౌలింగ్‌లోనూ 130 వికెట్లతో సత్తా చాటాడు. అలా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 2000+ పరుగులు, 15 హాఫ్ సెంచరీలు, 130 వికెట్లు పడగొట్టిన ఏకైక ప్లేయర్‌గా జడేజా రికార్డు సృష్టించాడు. ఈ డబ్ల్యూటీసీలో ఇంతటి గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్ ఒక్కడే!
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?