జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే భారత రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను శ్యామా ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. కశ్మీర్‌కు స్వయంతప్రతిపత్తి కల్పించకుండా భారత్‌లోనే పూర్తిగా విలీనం చేయాలని వాదించారని చెప్పారు. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజని పేర్కొంటూ 1901లో బంగాల్లో పుట్టిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయవాద నాయకుడని తెలిపారు.
దేశ ప్రజలు ఆయనను జమ్ముకశ్మీర్‌తో అనుసంధానిస్తున్నారని చెబుతూ అది నిజమే ఎందుకంటే ఆయన లేకపోతే కశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉండేది కాదని చెప్పారు. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ ఛాలెంగే అంటూ నినాదాలు చేస్తూ కశ్మీర్ కోసం తన ప్రాణాలను అర్పించారని నివాళులర్పించారు. అలాగే బెంగాల్ ఈ రోజున భారత్‌లో భాగంగా ఉండటానికీ కూడా శ్యామా ప్రసాద్ ముఖర్జీ, స్వామి ప్రణవానందకే పూర్తి క్రెడిట్ చెందుతుందని అమిత్ షా తెలిపారు.
ఇక 10 మందితో ప్రారంభించిన భారతీయ జనసంఘ్ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని అమిత్ షా పేర్కొన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాన్ నెహ్రూ మంత్రివర్గాన్ని బుజ్జగించే విధానానికి నిరసనగా ఆయన రాజీనామా చేశారని, ఆ తర్వాత భారతీయ జనసంఘ్‌ను స్థాపించారని తెలిపారు. ఇది భారతీయ సంస్కృతి, ప్రయోజనాలకు కోసం అంకితమైన పార్టీగా దీనిని తీసుకొచ్చారని చెప్పారు.
నాడు 10మందితో ప్రారంభమై, నేడు 12 కోట్ల మంది సభ్యులతో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు `నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని అమిత్ షా చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, జవహర్‌లాన్ నెహ్రూ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో పరిశ్రమల, సరఫరా శాఖ మంత్రిగా చేరారు.
ఆ పదవిలో ఉండగా, చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ, సింద్రి ఫర్టిలైజర్ కార్పొరేషన్, హిందుస్థాన్ వంటి దిగ్గజ సంస్థలు ప్రారంభించి, భారత పారిశ్రామిక వృద్ధికి బలమైన పునాది వేసే సంస్థలను స్థాపించారు. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేసి 1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు.

More Stories
భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత దేశం
యూపీలో ఇకపై రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు
నీట్ పేపర్ లీక్ లో ఆర్సీసీ వ్యవస్థాపకుడు శివరాజ్ అరెస్టు