
Kiran Mazumdar-Shaw
* కరోనా వ్యాక్సిన్ లపై వాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం
కరోనా వ్యాక్సిన్‌పై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చేసిన వ్యాఖ్యలను బయోకాన్ ఫౌండర్ కిరణ్ మంజుందార్ ఖండించారు. వాస్తవానికి హసన్ జిల్లాలో దాదాపు గత నెలలో 18 మంది గుండెపోటు కారణంగా చనిపోయారు. అయితే, ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణమని, వ్యాక్సిన్లను కేంద్రం త్వరగా ఆమోదించిందని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
తొందరపాటుతో ఆమోదించడం పంపిణీ చేయడం కూడా మరణాలకు కారణం కావొచ్చనే విషయాన్ని తిరస్కరించలేమని చెప్పుకొచ్చారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కమిటీని ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. కాగా, సీఎం వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ కిరణ్ మంజుందార్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతోనే వ్యాక్సిన్లు తయారయ్యాయని, నిబంధనల ప్రకారం అన్ని వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అనుమతిని పొందినట్లు ఆమె చెప్పారు.
వ్యాక్సిన్ల లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయన్న బయోకాన్ ఫౌండర్ అలాంటి వాటిపై తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సరికాదని హితవు చెప్పారు. దుష్ప్రభావాలు చాలా అరుదుగా నమోదయ్యాయన్న ఆమె టీకాల దుష్ప్రభావాలు చాలా అరుదుగానే నమోదయ్యాయని, వ్యాక్సిన్లపై నిందలు ఆపాలని, వాటి వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని గౌరవించాలంటూ ఆమె సూచించారు.
ఇదిలా ఉండగా, ఆకస్మిక మరణాలకు, టీకాలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇప్పటీ స్పష్టం చేసింది. ఐసీఎంఆర్-ఎయిమ్స్ నిర్వహించిన అధ్యయనాల్లో వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని, దుష్ప్రభావాలు అరుదుగా గుర్తించినట్లు పేర్కొంది. మరణాలకు జీవనశైలి, ఆరోగ్య సమస్యలే కారణమని స్పష్టం చేసింది.
తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో పాటు వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ సైతం స్పందిస్తూ కరోనా కాలంలో అనేక మంది ప్రాణాలను కాపాడాయని వ్యాక్సిన్లను ప్రశంసించారు. “కరోనా టీకాలు చాలా ప్రభావవంతంగా పనిచేశాయి. అనేకమంది ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్ర పోషించాయి. కరోనా కాలంలో ప్రాణాలను కాపాడుకునేందుకు వ్యాక్సిన్లతో మాత్రమే సాధ్యం. అందుకే భారీ స్థాయిలో ప్రజలు వ్యాక్సిన్లు వేసుకున్నారు” అని ఎయిమ్స్ వైద్యులు కరన్ మదన్ తెలిపారు.
ఫలితంగా అనేక మంది మరణం నుంచి తప్పించుకున్నారని పేర్కొంటూ ఇటీవలె ఆకస్మిక గుండెపోటు మరణాలకు వ్యాక్సిన్ ప్రభావం ఉందా? అనే కోణంలో అధ్యయనం చేయగా ఎలాంటి సంబంధం లేదని తేలిందని చెప్పారు.
More Stories
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తం
ఆపరేషన్ సింధూర్ తో ముక్కలైన మసూద్ కుటుంబం
బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన