వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జులై 19న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కిరణ్ రిజిజు ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యపై స్పష్టత ఇవ్వాలని కోరాయి. ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను కూడా తెలపాలని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలోనే వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది.
అయితే 2025లో జనవరి 31వ తేదీ- ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అప్పుడే ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమెదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో బిల్లుగా మారింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమావేశాల్లో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు 2025 కూడా ఆమోదం పొందింది.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!