
థాయిల్యాండ్ ప్రధాని పెటంగటార్న్ షినవత్రాపై వేటు వేశారు. ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆ సస్పెన్షన్ విధించింది. పొరుగు దేశం కంబోడియాతో జరిగిన ఫోన్ సంభాషణ కేసులో విచారణ చేపట్టిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పిస్తూ రాజ్యాంగ కోర్టు 7-2 తేడాతో తీర్పును వెలువరించింది. జూలై ఒకటో తేదీ నుంచి ప్రధాని షినవత్రా సస్పెన్షన్ అమలులోకి రానున్నది. కంబోడియాతో బోర్డర్ చర్చలు నిర్వహిస్తున్న వేళ.. షినవత్రా తన విలువలు మరిచినట్లు కన్జర్వేటివ్ సేనేటర్లు ఆరోపించారు.
ప్రధాని ప్రవర్తన వల్లే సరిహద్దు సమస్య మరింత జఠిలమైందని, దాని వల్ల మే నెలలో సీమాంతర ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సేనేటర్లు ఆరోపించారు. ఆ ఘర్షణల్లో ఓ కంబోడియా సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. చర్చలకు చెందిన ఫోన్ కాల్ లీక్ కావడంతో షినవత్రాపై ఆరోపణలు నమోదు అయ్యాయి. కంబోడియా రాజకీయవేత్తను అంకుల్ అని సంబోధించడం, మిలిటరీ కమాండర్‌ను ప్రత్యర్థిగా భావిస్తూ కామెంట్ చేసినట్లు షినవత్రాపై ఆరోపణలు ఉన్నాయి.
రాజ్యాంగ తీర్పును సవాల్ చేస్తూ మరో 15 రోజుల్లోగా ప్రధాని షినవత్రా తన వాదనలను వినిపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆమె కేసును డిస్మిస్ చేస్తారు. ఈ సమయంలో తాత్కాలిక దేశ ప్రధానిగా డిప్యూటీ పీఎం సురియా జున్‌గ్రున్‌గ్రుంగిట్ విధులు నిర్వర్తించనున్నారు. ఒకవేళ పెటంగటార్న్ షినవత్రాను డిస్మిస్ చేస్తే, ప్రధాని బాధ్యతల నుంచి సస్పెండ్ అయిన రెండో వ్యక్తిగా ఆమె నిలుస్తారు.
కంబోడియాతో తాజా సరిహద్దు వివాదాన్ని ఆమె నిర్వహించడంపై పేటోంగ్‌టార్న్ తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటోంది. మే 28న జరిగిన సాయుధ ఘర్షణలో ఒక కంబోడియా సైనికుడు మరణించాడు. కంబోడియా సెనేట్ అధ్యక్షుడు హున్ సేన్‌తో ఆమె దౌత్యంలో పాల్గొంటున్నప్పుడు లీక్ అయిన ఫోన్ కాల్ ఫిర్యాదులు, ప్రజా నిరసనలకు దారితీసింది. కోర్టు ఉత్తర్వు తర్వాత, దేశాన్ని రక్షించడం, శాంతిని కాపాడటం తప్ప తనకు వేరే ఉద్దేశాలు లేనందున, తాను ఈ ప్రక్రియను అంగీకరిస్తానని, తనను తాను రక్షించుకోవడానికి తన వంతు కృషి చేస్తానని పేటోంగ్‌టార్న్ చెప్పారు.
మంగళవారం ప్రారంభంలో, లీక్ అయిన ఫోన్ కాల్ కారణంగా ఒక ప్రధాన పార్టీ పేటోంగ్‌టార్న్ సంకీర్ణం నుండి వైదొలిగినప్పుడు తప్పనిసరి అయిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రాజు మహా వజిరలాంగ్‌కార్న్ ఆమోదం తెలిపారు. ఈ పునర్వ్యవస్థీకరణలో భూమ్జైతై పార్టీ నాయకుడు అనుతిన్ చార్విరకుల్ స్థానంలో ఉప ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం