
భారత క్రీడా చరిత్రలో రెండో దుర్ఘటనగా పేర్కొనదగిన 11 మంది ప్రాణాలను బలిగొన్న చిన్నస్వామి తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యానిదే తొలి బాధ్యత అని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) కూడా సంచనల వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించిన ఆర్సీబీ మరుసటి రోజే కర్నాటకలో విజయయాత్రకు పిలుపునిచ్చింది.
విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకూ విక్టరీ పరేడ్‌లో నిర్వహిస్తామని, అభిమానులు భారీగా తరలిరావాలని బెంగళూరు ఫ్రాంచైజీ కోరింది. కానీ, అందుకు తగిన భద్రతా ఏర్పాట్లను మాత్రం చేయలేదు. అందుకే తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యమే ప్రథమ దోషి అని క్యాట్ అభిప్రాయపడింది. “ఐపీఎల్ విజేతగా నిలిచిన తర్వాత బెంగళూరు టీమ్ ఎక్స్ వేదికగా విక్టరీ పరేడ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ జూన్ 4న చిన్నస్వామికి భారీగా తరలివచ్చారు. 35 వేల సామర్థ్యం ఉన్న స్టేడియానికి 2.5లక్షల మంది రావడంతో పోలీసులు వాళ్లను అదుపు చేయలేకపోయారు” అని తెలిపింది.
పైగా వాళ్లకు అంతమందిని నియంత్రించేందుక అవసమరైన బలగాలను సమకూర్చుకునే సమయం కూడా లేకపోయింది. అయినా పోలీసులేమీ దేవుళ్లు కాదు కదా.. అంతా క్షణాల్లో అదుపు చేయడానికి. సో.. ఈ దుర్ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని చెబుతూ ఆర్సీబీ యాజమాన్యం తప్పించుకోవడానికి లేదని క్యాట్ వెల్లడించింది. చిన్నస్వామి తొక్కిసలాట తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.
భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా సైతం ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా విక్టరీ పరేడ్ జరపడాన్ని ఖండించాడు. దాంతో, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కర్నాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఫలితంగా ఆర్సీబీ, కర్నాటక క్రికెట్ సంఘం, ఈవెంట్ ప్లానింగ్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. అనంతరం కేసీసీఏ సెక్రటరీ ఏ శంకర్, కోశాధికారి జయరామ్ రాజీనామా చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా బీసీసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది.
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు