
ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ జంతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నైలోని ఓ ప్రముఖ ఆలయానికి రోబోటిక్ ఏనుగును కానుకగా ఇచ్చారు. ఈ సాంకేతిక అద్భుతాన్ని ‘పీపుల్ ఫర్ క్యాటిల్ ఇన్ ఇండియా’ (పి ఎఫ్ సి ఐ) అనే జంతు సంక్షేమ సంస్థతో కలసి అందించడంతో, సాంప్రదాయాలను కాపాడుతూనే మూగజీవాలకు హాని కలగకుండా ఉండే మార్గాన్ని ఆమె సూచించారు.
చెన్నైలోని శ్రీ అష్టలింగా ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి త్రిష విరాళంగా అందించిన రోబోటిక్ ఏనుగుకు `గజ’ అని పేరు పెట్టారు. వేదమంత్రాల నడుమ, మంగళవాయిద్యాల శబ్దంలో ఈ యాంత్రిక ఏనుగును ఆలయానికి శాస్త్రోక్తంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో పీఎఫ్సీఐ సంస్థ ప్రతినిధులు పాల్గొని పూజారులకు ఏనుగును అధికారికంగా అప్పగించారు.
ఇకపై ఈ యాంత్రిక ఏనుగు ఆలయ పూజలు, ఊరేగింపులు, ఉత్సవాలలో ముఖ్య పాత్ర పోషించనుంది. సాంప్రదాయాలు, ఆచారాల ఉల్లంఘన కాకుండా, వాటిని కొనసాగించేందుకు ఇది మంచి మార్గమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
More Stories
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తం
ఆపరేషన్ సింధూర్ తో ముక్కలైన మసూద్ కుటుంబం
బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన