
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు అయ్యే నాటికి ఏపీని సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని చెప్పారు. “దేశం నిర్దేశించుకున్న వికసిత్ భారత్లో అంతర్భాగమే ఇది. 2047 నాటికి ఏపీని జీడీపీ, పెట్టుబడులు, నాణ్యమైన జీవితాన్ని అందించడం వంటి విషయాల్లో దేశంలోనే మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భావిభారత పౌరులంతా ఈ లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని గవర్నర్ తెలిపారు.
దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఓడ రేవు నగరాల్లో మచిలీపట్నం ఒకటని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఉద్యమాలకు పుట్టినిల్లుగా అభివర్ణించారు. ఎంతో మంది గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులను కృష్ణా జిల్లా అందించిందని గుర్తుచేశారు. పీజీలు, డిగ్రీలు పొందడంతో నేర్చుకోవడం ఆపకూడదన్న లోకేశ్ సమాజాన్ని తీర్చిదిద్దే అధ్యాపకులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు