
అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్‌గా పోటీ పడేందుకు భారత సంతతి వ్యక్తి ప్రైమరీ ఎన్నికల్లో గెలిచాడు. డెమోక్రటిక్ పార్టీ తరనపు జోరన్ మామ్‌దానీ న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా పోటీచేయనున్నారు. అతని వయసు 33 ఏళ్లు. ఉగాండాలోని కంపాలలో భారతీయ సంతతి తల్లితండ్రులకు 1991, అక్టోబర్ 18వ తేదీను జోరన్ జన్మించారు.
జోరన్‌కు అనుకూలంగా 80 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. అతని తండ్రి మహమూద్ మామ్‌దానీకి భారతీయ మూలాలు ఉన్నాయి. కొలంబియా యూనివర్సిటీలో అతను ప్రొఫెసర్‌గా చేశారు. తల్లి ప్రఖ్యాత భారత-అమెరికన్ చిత్ర నిర్మాత మీరా నాయర్. ఆమెకు పంజాబీ మూలాలు ఉన్నాయి. ఒకవేళ మామ్‌దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైతే, ఆ పదవిలో ఉన్న తొలి ముస్లింగా రికార్డు సృష్టిస్తాడు. మేయర్‌గా మారిన తొలి ఇండో అమెరికన్‌గా కూడా అతనే నిలుస్తాడు.
ప్రైమరీ ఎన్నికల్లో సోషలిస్ట్ భావజాలం కలిగిన జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. రాజకీయ ఉద్ధండుడు, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికాలోనే అతిపెద్ద నగరమైన న్యూయార్క్‌లో జరిగిన ఈ హోరాహోరీ పోరులో మమ్దానీకి 43.5 శాతం ఓట్లు రాగా, ఆండ్రూ క్యూమో 36.3 శాతంతో వెనుకంజలో నిలిచారు.
రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లు మూడు రెట్లు అధికంగా ఉన్న ఈ నగరంలో దాదాపు డజను మంది డెమోక్రటిక్ అభ్యర్థులు మేయర్ పీఠం కోసం పోటీ పడ్డారు. క్షేత్రస్థాయి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న జోహ్రాన్ డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా మద్దతుతో బరిలోకి దిగారు. తక్కువ ఖర్చుతో కూడిన గృహాలు, పోలీసు సంస్కరణలు, వాతావరణ మార్పులపై చర్యలు వంటి ప్రగతిశీల అంశాలతో ప్రచారం నిర్వహించారుతన విజయానంతరం మమ్దానీ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, నెల్సన్ మండేలా మాటలను ఉటంకించారు. “ఇది పూర్తయ్యే వరకు అసాధ్యంలానే కనిపిస్తుంది. మిత్రులారా ఇది పూర్తయింది. దాన్ని చేసింది మీరే. న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిగా ఎంపికైనందుకు నేను గర్వపడుతున్నాను” అని ఆయన పేర్కొన్నారు.vమీ కోసం పనిచేసే సిటీ కోసం పోరాటం చేస్తానని, సిటీని సురక్షితంగా ఉంచుతానని అన్నారు. విక్టరీ ప్రసంగంలో మాట్లాడుతూ.. స్వేచ్ఛగా ఉండవచ్చు అని, ఆహారం పొందవచ్చు అని, మనకు కావాల్సింది డిమాండ్ చేయవచ్చు అని తెలిపారు.
అయితే ఈ ఎన్నిక ప్రైమరీ ర్యాంక్డ్ చాయిస్ ద్వారా నిర్ణయించింది కాబట్టి తుది ఫలితాలు జులై1న వెల్లడికానున్నాయి. నవంబర్ 4న జరిగే సాధారణ ఎన్నికల్లో మమదాని స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్‌తో తలపడాల్సి ఉంటుంది.
More Stories
రష్యా ఆర్మీలోకి బలవంతంగా భారతీయ యువత
ఆసియా కప్ బాయ్‌కాట్ అంటూ బెట్టు చేసి తోకముడిచిన పాక్
అరబ్-ఇస్లామిక్ నాటో… ఇస్లామిక్ దేశాల సైనిక కూటమి