రివ్యూ ప్యానెల్ ను ఎస్ఐబి తప్పుదోవ పట్టించింది

రివ్యూ ప్యానెల్ ను ఎస్ఐబి తప్పుదోవ పట్టించింది
ఫోన్ ట్యాపింగ్ కేసులో రివ్యూ కమిటీ ప్యానెల్ ను ఎస్ఐబి తప్పుదోవ పట్టించిందని  అప్పటి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, న్యాయశాఖ కార్యదర్శి  దర్యాప్తు జరుపుతున్న సిట్ కు తెలిపారు.  మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆమె వాంగూలా న్ని నమోదు చేయనుండగా, సోమవారం సిట్ అ ధికారులు రఘునందన్‌రావు వాంగ్మూలాన్ని రి కార్డు చేసారు. 
 
తమను ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్‌రా వు తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు చేసారు. జి ఎడి కార్యదర్శి రఘునందన్‌రావు చెప్పిన విషయాన్నే న్యాయశాఖ కార్యదర్శి నిర్ధారించారు. దీంతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉ న్న శాంతికుమారి వాదన కూడా ఇందుకు అనుగుణంగానే ఉండే అవకాశం ఉందని అంచనా వే స్తున్నారు.ఇదే కేసులో ఇప్పటికే అప్పటి హోం శాఖ కార్యదర్శి (ప్రస్తుత డిజిపి) జితేందర్, అ ప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ కూ డా త మను తప్పుదోవ పట్టించడం వల్లనే ఫోన్ ట్యా పింగ్‌కు అనుమతించినట్టు చెప్పిన విషయం తెలిసిందే.
 
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, 1885లోని సెక్షన్ 5(2) ప్రకారం, ఏదైనా ఓ వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే పోలీసులు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అనంతరం ట్యాపింగ్ చేయాల్సిన ఫోన్ నెంబర్ల జాబితాను ఆయన రివ్యూ కమిటీకి పంపుతారు. ఆ రివ్యూ కమిటీ కేంద్ర టెలికం శాఖ నుంచి అనుమతి తీసుకున్నాకే సదరు ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది.
 
అయితే, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోని ఎస్‌ఐబీ బృందం ట్యాపింగ్‌ కోసం సుమారు 618 ఫోన్‌ నంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టగా, నాటి సీఎస్ శాంతి కుమారి ఆ ఫోన్ నెంబర్ల లిస్ట్‌ను కేంద్ర టెలికం శాఖకు పంపి అనుమతి తీసుకున్నట్లుగా సిట్‌ గుర్తించింది.  మావోయిస్టు సానుభూతిపరులు ఉగ్రవాద సంబంధిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎస్ఐబీ నుంచి రివ్యూ కమిటీకి లేఖ ఇచ్చినట్లు గుర్తించారు. 
 
ఇదిలా ఉంటే ఈ కేసులో ఎన్నికల సమయంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీలో ఉన్న సమయంలో ఫోన్ టాపింగ్ జరిగినట్టు సిట్ బృందం గుర్తించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి తదితరుల ఫోన్లు టాప్ అయినట్టు గుర్తించారు. దీంతో కాంగ్రెస్ నేత హరి వర్ధన్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత బిల్లా సుధీర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.