
* 125కు పైగా యుద్ధ విమానాలతో ఆపరేషన్ మిడ్నైట్
ఇరాన్‌లోని మూడు కీలకమైన అణుకేంద్రాలపై అమెరికా ఆదివారం తెల్లవారు జామున విరుచుకుపడిన మిషన్‌కు ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ పేరు పెట్టినట్లుగా పెంటగాన్ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో 125పైగా యూఎస్ యుద్ధ విమానాలు, మిస్సైల్స్ పాల్గొన్నాయని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ ప్రకటించారు. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.
సాధారణ పౌరులకు హాని జరుగకుండా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. బాంబర్లు, ఫైటర్ జెట్లు, ట్యాంకర్లు, నిఘా విమానాలు సహా 125పైకిగా అమెరికన్ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని చెప్పారు. పశ్చిమాసియాలో భద్రత, శాంతిని కొనసాగించేందుకు ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రి పీట్ హాగ్సేత్ పేర్కొన్నారు. కాగా, ఇరాన్ శాంతి మార్గాన్ని అవలంబించకపోతే, అమెరికా మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదని హెచ్చరించారు.
ఇరానియన్ సైనికులు, ఇరానియన్ ప్రజలను లక్ష్యంగా దాడులు చేయలేదని స్పష్టం చేశారు. రాత్రి అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ అర్ధరాత్రి మూడు ఇరానియన్ అణు స్థావరాలు, ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై ఖచ్చితమైన దాడి చేసిందని, ఇది అద్భుతమైన విజయమని పేర్కొన్నారు. తమ కమాండర్ ఇన్ చీఫ్ నుంచి అందిన ఆదేశాల మేరకు అణుకేంద్రాలను నాశనం చేసినట్లు తెలిపారు. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రణాళిక ధైర్యంగా, అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.
అధ్యక్షుడు శాంతి గురించి మాట్లాడితే చర్చల కోసం 60 రోజులు సమయం ఇస్తారని, కానీ, ఆ తర్వాత ఇరాన్ అణుకార్యక్రమం మనుగడ సాగించదని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ తయారీలో ఇజ్రాయెల్ సైతం కీలకపాత్ర పోషించిందని పీట్ హెగ్సేత్ తెలిపారు. చరిత్రలో తొలిసారిగా ఈ ఆపరేషన్‌లో ఎంవోపీ వంటి భారీ బాంబులను ఉపయోగించినట్లు తెలిపారు.ఈ బాంబులు 30వేల బరువు ఉంటాయని, వాటికి భూగర్భ బంకర్లను నాశనం చేయగలవని చెప్పారు.
More Stories
రామ్‌గోపాల్ వర్మపై ఐపీఎస్ అంజనీ సిన్హా కేసు!
వారసత్వ రాజకీయాల్లో అగ్రగామి ఏపీ
రష్యా ఆర్మీలోకి బలవంతంగా భారతీయ యువత