
కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, డిసిసి మాజీ అధ్యక్షుడు పి.మురళీకృష్ణ బిజెపిలో చేరారు. ఆయన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరగా, ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా చేరారు. పరిగెలకు పురందేశ్వరి పార్టీ కండువా కప్పి, సాధరంగా ఆహ్వానించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశం సందర్భంగా పురంధేశ్వరి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం గమనార్హం.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉంటూ కోట్ల వర్గీయుడిగా మురళీకృష్ణ గుర్తింపు పొందారు. వారి చొరవతో గతంలో కోడుమూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరుగు అవడంతో ఆ తర్వాత కొన్ని రోజులు మురళీకృష్ణ తటస్థంగా ఉంటూ వచ్చారు. అనంతరం వైసీపీలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ గా పదవి కట్టబెట్టారు. ఈ క్రమంలో వైసిపి నుంచి కోడుమూరు టికెట్ ను ఆశించారు.
అయితే టికెట్ మరొకరికి కట్టడంతో తిరిగి మురళీకృష్ణ కాంగ్రెస్ లో చేరారు. డిసిసి అధ్యక్షులుగా ఆయన కొనసాగుతున్న క్రమంలో కొన్ని సొంత నిర్ణయాలతో డిసిసి అధ్యక్ష పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన బిజెపి కండువా కప్పుకున్నారు. కాగా, దేశాభివృద్ధి, అందరి సంక్షేమమే ప్రధాని మోదీ ధ్యేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు.
గుడిసె దేవానంద్ అధ్యక్షతన జరిగినఆదివారం ఎస్సీ మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సమ్మేళనాలు నిర్వహించి ఆయా వర్గాలకు మోదీ ప్రభుత్వం చేసిన మేలు వివరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పురందేశ్వరితోపాటు ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ భోలా సింగ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాటికి వికసిత్ భారత్ సాధించేలా లక్ష్యంగా పెట్టుకున్నారని పురందేశ్వరి చెప్పారు.
ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందు ఉండాలని, వాటి ద్వారా వచ్చే ఫలితాలను సమాజంలో అన్ని వర్గాల వారికి అందించడమే ప్రధాన ఉద్దేశమని, అందరికీ సంక్షేమం, దేశం అభివృద్ధి సాధించడమే వికసిత్ భారత్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. 23వ తేదీన శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివాస్ సందర్భంగా నివాళులు అర్పిస్తామని, ఎమర్జెన్సీ దివస్తో పాటు, తల్లి పేరుతో ఒక మొక్కను నాటే కార్యక్రమం చేపడుతున్నామని ఆమె వివరించారు. కాంగ్రెస్ అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయం చేసిందని విమర్శిస్తూ అంబేద్కర్ కోసం అసలు కాంగ్రెస్ నేతలు ఏం చేశారో చెప్పగలరా? అని ఆమె ప్రశ్నించారు.
More Stories
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి