
ఇంజనీరింగ్ విద్యాసంస్థలలో డొనేషన్ ల పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆందోళన చేపట్టింది. రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థుల సీట్ల భర్తీ విషయంపై ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని కోరారు.
డొనేషన్ల పేరు మీద విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక భారం మోపుతూ ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటువంటి కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల కానీ కారణంగా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి కళాశాలల గుర్తింపును వెంబడే తొలగించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్, తరుణ్, చితరంజన్, కుమార్, సంతోష్, ప్రధాన కార్యదర్శులు సామల పవన్, గణేష్, సురేష్, కోశాధికారి యోగి, కార్యదర్శి ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు