
ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఫీజుల పెంపునకు ప్రాతిపదిక ఏమిటి? ప్రతిసారి ఎందుకు పెంచుకుంటున్నారు? నిబంధనలు పాటిస్తున్నారా లేదా? వారిచ్చే విద్య నాణ్యత ఎంత? ఆలస్యమైనా ఫర్వాలేదు. మరింత లోతుగా, శాస్త్రీయంగా అధ్యయనం చేయండని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ‘బీటెక్ ట్యూషన్ ఫీజులను పెంచాల్సిన అవసరం ఉన్నదా? అయినా ఆ విషయం తర్వాత చూద్దాంలే’ అని దాటవేసిన్నట్లు చెబుతున్నారు.
‘ఈ ఫీజులను తగ్గించాలి. వర్కవుట్ చేద్దాం. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇబ్బందులు కలగొద్దు. ఈ ఫీజులపై తర్వాత చూద్దాం’ అని పేర్కొన్నట్టుగా అధికార వెల్లడించాయి. అనేక ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇప్పటికే ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఆయన.. పేద విద్యార్థులు ప్రతిభ ఆధారంగా కన్వీనర్ కోటాలో ప్రముఖ కాలేజీల్లో సీటు సాధించినా, వార్షిక ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారని గుర్తుచేశారు. విద్యార్థులపై భారం పడకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం 2016 విద్యా సంవత్సరంలో 40 విజిలెన్స్ బృందాలను కళాశాలలకు పంపించి, రికార్డులను తనిఖీ చేయించింది. ఆ నివేదికలు ఎక్కడ ఉన్నాయి? వాటిని అనుసరించి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై అధికారులు ప్రస్తావించగా, ఇంజినీరింగ్ విద్య తరహాలోనే పాఠశాలల ఫీజుల నియంత్రణపై చట్టం చేద్దామని, సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు తెలుస్తోంది.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?