
* ఆరుగురు అణు శాస్త్రవేత్తల హతం
గత కొన్ని నెలలు హమాస్‌ను తుదముట్టించే పే రుతో పాలస్తీనాపై ఏకపక్షంగా బాంబుల మోతమోగిస్తున్న నెతన్యాహూ సైన్యం తాజాగా ఇరాన్‌పై దాడులకు దిగింది. అణు కర్మాగారం, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేసింది. డజన్ల కొద్దీ దాడులు జరిగియాని సమాచారం. దీంతో ఇరాన్‌కు భారీ నష్టం జరిగినట్లు
ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ సైనిక బలగాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ భగేరి మృతిచెందారు. ఇరాన్ సైనిక దళాల్లో అత్యున్నత ర్యాంక్ కలిగిన ఆఫీసర్ భగేరి. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ జరిపిన దాడిలో మృతిచెందిన వ్యక్తుల్లో భగేరి రెండో కీలక వ్యక్తిగా నిలిచారు. తాజా దాడిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ హుస్సేన్ సలామీ కూడా మృతిచెందారు. ఆరుగురు అణు శాస్త్రవేత్తలతో పాటు పలువురు సైనిక కమాండర్లు మృతి చెందారు.
ఆపరేషన్ రైజింగ్ లయన్‌లో భాగంగా నిర్వహించిన దాడుల్లో నటాంజ్‌లో ఉన్న అణు శుద్దీకరణ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఇరాన్ చేపడుతున్న బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్‌కు నటాంజ్ కేంద్రం ప్రధానంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టుల్లో ఫోరోదూన్ అబ్బాస ఇరాన్ ఆటమిక్ ఎనర్జీ ఆర్గనేజేష్ మాజీ అధిపతిగా ఉన్నారు. అలాగే పార్లమెంటు సభ్యుడు కూడా. మహమ్మద్ మెహదీ టెహ్రాంచి అనే సైంటిస్ట్ సైద్ధాంతిక భౌతక శాస్త్రవేత్త. షషీద్ బేహిస్థీ యూనివర్శిటీ కులపతిగా పనిచేశారు.
అబ్దుల్ హమీద్ జోల్ఫఘరి అనే శాస్త్రవేత్త న్యూక్లియర్ సైంటిస్ట్‌గా ఉన్నారు. సయూ సైయద్ ఫఖి న్యూక్లియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మరో న్యూక్లియర్ శాస్త్రవేత్త మత్లాబి జడే. వీరంతా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం, బాలిస్టిక్ మిసైల్ కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్టుగా యూఎన్ భద్రతా మండలి తీర్మాన జాబితాలో ఉంది. కాగా, తాజాగా ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల్లో అమెరికా సహాయం కానీ, పాత్ర కానీ లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబో స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాల వీడియోను ఐడీఎఫ్ విడుదల చేసింది. ఇరాన్‌పై జరిగిన దాడుల్లో సుమారు 200 ఐఏఎఫ్ విమానాలు పాల్గొన్నట్లు ఇజ్రాయిల్ మిలిటరీ చెప్పింది.
ఆ ఫైటర్ విమానాలు సుమారు 330 బాంబులను జార విడిచాయి. సుమారు వంద ప్రదేశాల్లో వాటిని పేల్చినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. శుక్రవారం ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. దీనికి ప్రతిగా టెహ్రాన్ సైతం ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగింది. డ్రోన్లతో విరుచునుపడుతోంది.
సుమారు వంద డ్రోన్లతో ఇరాన్ దాడి చేసినట్లు, ఆ దాడులను తిప్పికొట్టేందుకు సన్నద్దం అయినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇక ఇజ్రాయెల్ దాడులతో అప్రమత్తమైన ఇరాన్ తన గగనతలాన్ని మూసి వేసింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ, ముంబై నుంచి లండన్, న్యూయార్క్‌కు వెళ్లే అనేక విమానాలు ప్రభావితమయ్యాయి. పలు విమానాలను దారిమళ్లించగా, మరికొన్ని వెనక్కి తిరిగి వస్తున్నాయి. ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధీకరణ కార్యక్రమం, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఇరాన్ ముప్పును తిప్పికొట్టడమే టార్గెట్‌గా సైనిక చర్య చేపట్టామని చెప్పుకొచ్చారు. ఇరాన్ ముప్పు తొలగించడానికి ఎన్ని రోజులైనా ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అయితే, ఇజ్రాయిల్ తీవ్ర పరిణామాలను చవిచూస్తుందని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయిల్ దాడులపై ఇరాన్ తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని ప్రతిజ్ఞ చేసింది. ఈ నేరంతో ఇజ్రాయిల్ తీవ్రమైన, బాధాకరమైన పరిణామాలను ఎదుర్కొంటుందని ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ తీసుకునే చర్యలకు ఇజ్రాయిల్ కఠినమైన శిక్ష ఎదుర్కోవలసి వుంటుందని ఖమేనీ పేర్కొన్నారు.
అయితే, ఇజ్రాయిల్ తీవ్ర పరిణామాలను చవిచూస్తుందని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయిల్ దాడులపై ఇరాన్ తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని ప్రతిజ్ఞ చేసింది. ఈ నేరంతో ఇజ్రాయిల్ తీవ్రమైన, బాధాకరమైన పరిణామాలను ఎదుర్కొంటుందని ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ తీసుకునే చర్యలకు ఇజ్రాయిల్ కఠినమైన శిక్ష ఎదుర్కోవలసి వుంటుందని ఖమేనీ పేర్కొన్నారు.
ఇజ్రాయిల్ క్రూరమైన, రక్తపు మరకల చేతులతో తమ దేశంలో నేరానికి తెరతీసిందని చెబుతూ నివాస కేంద్రాలపై దాడితో ఇజ్రాయిల్ దుర్మార్గపు స్వభావాన్ని గతంలో కంటే అధికంగా బయటపెట్టిందని ఆగరహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ ప్రాణాంతక దాడులకు ప్రతిస్పందించేందుకు తమకు న్యాయమైన చట్టబద్ధమైన హక్కు ఉందని తెలిపారు.
ఐరాస నిబంధనల్లోని ఆర్టికల్ 51 ప్రకారం దురాక్రమణకు ప్రతిస్పందించడానికి తమకు చట్టపరమైన హక్కు ఉందని పేర్కొన్నారు. ఇరాన్ సాయుధ దళాలు తమ శక్తి మేరకు దేశాన్ని రక్షించేందుకు యత్నిస్తారని చెబుతూ ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి వుంటుందని ఇరాన్ పేర్కొంది.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు