
భారతదేశంలో ఎన్నికల జాబితాను నిర్వహించడం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన, పారదర్శకమైన కార్యక్రమమని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. దేశంలోని అన్ని గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ పార్టీలకు చట్ట ప్రకారం ఎలక్ట్రోరల్ రోల్స్ పంపిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. ప్రతి ఏడాదికి ఒకసారి, ఎన్నికలకు ముందు ఎలక్ట్రోరల్ రోల్స్ను సవరిస్తామని తెలిపారు.
మంగళవారం స్టాక్ హోమ్ లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఇందులో 50 దేశాలకు చెందిన సుమారు 100 మంది ఎన్నికల సంఘం ప్రతినిథులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల విశ్వసనీయతను నిలబెట్టడంతో సీఈసీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేసింది. 1960 నుంచి గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ఎలక్ట్రోరల్ రోల్స్ పంపిస్తున్నామని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. అభ్యంతరాలు, క్లైయిమ్స్, అప్పీల్స్కు అవకాశం ఇస్తామని చెప్పారు.
ఎన్నికల ప్రక్రియను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు, పోలీసులు, వ్యయ పరిశీలకులు, మీడియా నిశితంగా పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. వీరంతా ఆడిటర్ల మాదిరిగానే వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల్లో రిగ్ చేయడానికి ఓటర్ల డేటాను వినియోగిస్తున్నారంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పష్టత ఇచ్చారు. భారతదేశంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సమన్వయ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు చేసింది.
ఎన్నికల నిర్వహణ సమయంలో పోలింగ్ సిబ్బంది, పోలీసులు, పరిశీలకులు, రాజకీయ పార్టీల ఏజెంట్లతో సహా మొత్తంగా 20 మిలియన్లకు పైగా సిబ్బంది ఉంటారని తెలిపింది. వీరందరిని కలిపితే ఎన్నికల కమిషన్ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా అవతరిస్తుందని చెప్పింది. ఫలితంగా అనేక జాతీయ ప్రభుత్వాలు, ప్రధాన ప్రపంచ సంస్థల సంయుక్త శ్రామిక శక్తిని అధిగమిస్తుందని పేర్కొంది. వీరిందరి సహకారంతో దేశంలోని దాదాపు ఒక కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోగలరని సీఈసీ చెప్పారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా