ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఫైనల్‌కు పంజాబ్‌ కింగ్స్‌

ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఫైనల్‌కు పంజాబ్‌ కింగ్స్‌
ఐపీఎల్‌-18 సీజన్‌ ఆసాంతం అద్భుతంగా రాణిస్తున్న పంజాబ్‌ కింగ్స్‌ తొలి క్వాలిఫయర్‌లో ఓడినా రెండో క్వాలిఫయర్‌లో అదరగొట్టింది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్‌కు మొదటి సారిగా అర్హత సాధించింది. ముంబై నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఛేదించింది.
ఈ విజయంతో పంజాబ్‌ మంగళవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. అయ్యర్‌ 41 బంతుల్లో 5 ఫోరుల, 8 సిక్సర్లతో 87 పరుగులతో రప్ఫాడించాడు.
శ్రేయాస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 87*, 5 ఫోర్లు, 8 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు నెహల్‌ వధెర (48), జోష్‌ ఇంగ్లిస్‌ (38) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వరుణుడి ఆటంకంతో రెండు గంటల పాటు ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసి ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబై జట్టులోని హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మ (29 బంతుల్లో 44, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొచ్చి మెరుపులు మెరిపించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (26 బంతుల్లో 44, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి రెచ్చిపోగా జానీ బెయిర్‌ స్టో (24 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్‌ ధీర్‌ (18 బంతుల్లో 37, 7 ఫోర్లు) దూకుడుగా ఆడారు.
ఈ మ్యాచ్‌లో 204 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన పంజాబ్‌ 3వ ఓవర్‌లో తన మొదటి వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్‌ సింగ్‌ బోల్ట్‌ బౌలింగ్‌లో టోప్లేకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జోష్‌ ఇంగ్లీష్‌, ప్రియాన్ష్‌ ఆర్యాతో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రియాన్ష్‌ 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 20 పరగులు చేసి ఆశ్విని కూమార్‌ బౌలింగ్‌లో హర్దిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
72 పరుగుల వద్ద పాండ్యా బౌలింగ్‌లో జోష్‌ ఇంగ్లీష్‌ బేయిర్‌ స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. జోష్‌ ఇంగ్లీష్‌ 5 ఫోర్లు, 2 ఫోర్లతో 38 పరగులు చేశాడు. ఈ క్రమంలో శ్రేయస్‌ ఆయ్యార్‌, నెహ్యాల్‌ వధేరా పంజాబ్‌ను ఆదుకున్నారు. 47 బంతుల్లో 84 పరగులు చేశారు.  ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. మూడో ఓవర్‌లో రోహిత్‌ శర్మ భారీ షాట్‌ కొట్టబోయి విజరు కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి 8 పరుగులకే ఔటయ్యాడు.  అయితే, జానీ బెయిర్‌ స్టో (38), తిలక్‌ వర్మ (44) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిర్మించారు.