
22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఐ స్టాండ్ విత్ శర్మిష్ట’, ‘ఈక్వల్ జస్టిస్’ అనే హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన ఆమె పూనే లా యూనివర్శిటీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తోంది. ఈమెను బెంగాల్ పోలీసులు గుర్గావ్ వెళ్లి మరీ అరెస్ట్ చేశారు.
ఆమె ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌కు, మత ఛాందసవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇస్టాగ్రాంలో పోస్ట్ పెట్టింది. ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు పెద్దగా స్పందించడంలేదని నిలదీసింది. ఆమెకు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లున్నారు అయితే, తీవ్ర పదజాలంతో కూడిన ఆమె వ్యాఖ్యలు కొందరిని బాధిస్తున్నాయనే ఉద్దేశ్యంతో ఆమె తన పోస్ట్ ను డిలీట్ చేసింది. ఆమె తన తప్పును అంగీకరించి, వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పింది.
అయితే, ఆమెను మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం అరెస్టు చేసింది. శర్మిష్ట చేసిన పోస్ట్‌పై కోల్కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో ఆమెను కలకత్తా పోలీసులు గుర్గావ్‌లో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ అరెస్ట్‌పై దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ చర్యలపై తీవ్ర నిరసనలూ వ్యక్తమవుతున్నాయి.
సదరు పోస్ట్ గురించి క్షమాపణలు చెప్పి, పెట్టిన పోస్ట్‌ను శర్మిష్ట తొలగించినప్పటికీ ఆమెపై బెంగాల్ పోలీసులు వేగంగా చర్య తీసుకున్నారని మండిపడ్డారు. కానీ ఎన్నికైన నాయకులు, టిఎంసి ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన లోతైన, తీవ్రమైన బాధ గురించి ఏమిటి? మన విశ్వాసాన్ని ‘గాంధ ధర్మం’ అని పిలిచినప్పుడు ఆ ఆగ్రహం ఎక్కడ ఉంది? వారి క్షమాపణ ఎక్కడ? వారి త్వరిత అరెస్ట్ ఎక్కడ? అని పవన్ మమతపై ప్రశ్నల వర్షం కురింపించారు.
దైవదూషణను ఎల్లప్పుడూ ఖండించాలన్న పవన్ లౌకికవాదం కొందరికి కవచం కాదు, మరికొందరికి కత్తి కాదు. ఇది రెండు వైపులా ఉండే చౌరస్తా అయి ఉండాలని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ పోలీసులూ.. దేశం చూస్తోంది. అందరికీ సమన్యాయంగా వ్యవహరించండి. అంటూ పవన్ తన పోస్ట్ లో హెచ్చరిక చేశారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం