ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన సీపీఐ(మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో బసవరాజు గురువు, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి దేశంలోకి తిరిగి వచ్చినట్లు బస్తర్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. 2018లో పక్కకు తప్పుకుని బసవరాజుకు బాధ్యతలు అప్పగించడానికి ముందు దాదాపు 15 ఏళ్ల పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఉన్నారు.
కొండపల్లి సీతారామయ్య మద్దతు దారుల నుండి నక్సల్ ఉద్యమాన్ని హస్తగతం చేసుకోవడంలో కీలక భూమిక వహించారు. రెండు కీలక నక్సల్ గ్రూపుల విలీనంతో మావోయిస్టు పార్టీ ఏర్పాటుకు కూడా సారధ్యం వహించారు. అయితే అవకాశాన్ని భద్రతా దళాలు కొట్టిపారవేస్తున్నాయి. “అనారోగ్యంతో బాధపడుతున్న గణపతి చికిత్స, విశ్రాంతి కోసం ఇన్నేళ్లు ఫిలిప్పీన్స్‌లో ఉన్నారు. ఎన్‌కౌంటర్‌లో బసవరాజు మరణించిన తర్వాత ఆయన దేశానికి తిరిగివచ్చారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సలహాదారుగా గణపతి ఉన్నారు. 70వ పడిలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మావోయిస్టులకు అధిపతిగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టలేరు” అని భావిస్తున్నాయి.
మరోవంక, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు చెందిన సీనియర్ కమాండర్ చేపట్టే అవకాశాలున్నాయని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే, బసవరాజు వారసుడి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం లేదని మావోయిస్టు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గుండెపోటుతో రామన్న మరణించిన తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా రామచంద్రా రెడ్డి ఎప్పుడు బాధ్యతలు తీసుకున్నారో అధికారికంగా ప్రకటించ లేదని గుర్తు చేస్తున్నారు.
బసవరాజు స్థానంలో ఎవరు బాధ్యతలు చేపట్టినా ఆ వ్యక్తికి భూమ్మీద నూకలు కొద్దికాలమే ఉంటాయని, ఎన్‌కౌంటర్‌లో ఆ వ్యక్తిని భద్రతా దళాలు అంతం చేస్తాయని నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు చెందిన అధికారి ఒకరు ధీమా వ్యక్తం చేశారు. బసవరాజు స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఆ గ్రూపులో ఎవరూ లేరని, మిగిలి ఉన్న నాయకులకు రెండే దారులు ఉన్నాయని, లొంగిపోవడమో లేక ఎన్‌కౌంటర్‌లో చావడమో వారే తేల్చుకోవాలని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ స్పష్టం చేశారు.
బసవరాజు, గణపతి తర్వాత ఆ స్థానానికి సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్, తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పేర్లు వినిపిస్తున్నాయి. జార్ఖండ్‌కు చెందిన మిషిర్ బెస్రా అలియాస్ భాస్కర్‌కి కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే మావోయిస్టు పార్టీలో తెలుగు వారి ప్రాబల్యం వల్ల ఇతరులకు నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు
కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు