
తిరుపతిలో తొలి గడప కడప.. దేవుని గడపలో జరిగే ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోందని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం కడపలో టిడిపి మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం జరిగింది. సిఎం చంద్రబాబు పార్టీ సభ్యత్వాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రాణ సమాణమైన టిడిపి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అంటూ తన ప్రసంగాన్ని ఆరంభించారు. ”రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిలో ఉండేది. తిరుమల తొలిగడప కడపలో ఈరోజు మహానాడు చేసుకుంటున్నాం. దేవుని గడపలో జరిగే ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోంది. ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాలు గెలిచి సత్తా చాటాం. ఈసారి ఇంకాస్త కష్టపడితే పదికి పది స్పీప్ చేస్తాం” అని తెలిపారు.
కడపలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలపడం కోసమే ఈ మహానాడును ఇక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు. “సార్వత్రిక ఎన్నికల్లో 57 శాతం ఓట్ షేరింగ్ సాధించాం. ఎన్డీఏతో సంబంధం పెట్టుకోవడం వల్ల కూడా మనకు కలిసి వచ్చింది. పార్టీ పని అయిపోయిందని అనుకునే వాళ్లకు.. వాళ్ల పని అయిపోయింది” అని స్పష్టం చేశారు.
“పాలన అంటే హత్య రాజకీయాలు, వేధింపులు, తప్పుడు కేసులు కాదు. విధ్వంసం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రశ్నించిన కార్యకర్తలని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. పీక కోస్తునా చంద్రయ్య జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా కార్యకర్తల్లో అదే జోరు. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే విజయం సాధ్యమైంది ” అని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పార్టీ ప్రస్థానం సాగుతోందని చెబుతూ సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధికి టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అని ఆయన స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పారు. ఇక 2047 నాటికి జీరో పావర్టీ సాధిస్తామని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గిస్తామని, అందరూ ఆరోగ్యం, ఆనందంగా ఉండాలన్నదే తమ విధానమని తెలిపారు.
రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ టీడీపీ అని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీగా పుట్టి జాతీయ స్థాయిలో ఎదిగామని, ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను ఎదుర్కున్నామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం