
కిరు జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు ఫైల్స్‌ను ఆమోదించేందుకు తనకు రూ.300కోట్ల లంచం ఇవ్వజూపారని అప్పట్లో ఆయన ఆరోపించారు. కానీ, గతేడాది సీబీఐ సోదాల తర్వాత తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆయన ఖండించారు. తానే ఫిర్యాదు చేస్తే తన ఇంట్లో సోదాలు నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అవినీతికి పాల్పడిన వారిపై దర్యాప్తు చేయడానికి బదులుగా సీబీఐ తన నివాసంపై దాడులు చేసిందని మాలిక్ పేర్కొన్నారు. దాడుల్లో నాలుగైదు కుర్తాలు, పైజామాలు తప్ప వారికేమీ దొరకవని, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తూ తనను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రైతు కొడుకునని.. భయపడను.. తలవంచనని స్పష్టం చేశారు.
సీబీఐ అప్పటి చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సివిపిపిపిఎల్ చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, ఎంఎస్ బాబు, ఎంకే మిట్టల్, అరుణ్ కుమార్ మిశ్రాలతో పాటు ఇతర అధికారులు, నిర్మాణ సంస్థ పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసింది. మాలిక్ సహచరులు, కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు అమలు సంస్థ చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంబంధం ఉన్న అధికారులను కూడా సీబీఐ లక్ష్యంగా చేసుకున్నది.
ఇ-టెండరింగ్ ద్వారా ప్రాజెక్టును తిరిగి టెండర్ చేయాలని బోర్టు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నప్పటికీ అది అమలు కాలేదని, చివరకు కాంట్రాక్టును పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు అప్పగించారని, ఇందులో అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపించింది.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ