కన్నడ రచయిత భాను ముస్తాక్ అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ అనే లఘ కథా రచనకు గాను ఆమెకు ఆ పురస్కారం దక్కింది. షార్ట్ స్టోరీ కలెక్షన్‌కు బూకర్ ప్రైజ్ దక్కడం ఇదే మొదటిసారి. భారతీయ ట్రాన్స్‌లేటర్ దీపా భస్తికి కూడా బూకర్ అవార్డు దక్కింది. భాను ముస్తాక్ రచనలకు అవార్డు ఇవ్వడం పట్ల జ్యూరీ రచయిత మ్యార్ పోర్టర్ స్పందించారు.
అందమైన జీవిత కథలకు చెందిన రచనలు కన్నడ నుంచి వచ్చాయని, రాజకీయ, సామాజిక అసాధారణ పరిస్థితుల్లో ఆ కథల్లో వర్ణించారని పోర్టర్ తెలిపారు. మహిళల జీవితాలు, పునరుత్పత్తి హక్కులు, విశ్వాసాలు, కులం, అధికారం, అణిచివేతకు సంబంధించిన కోణంలో కథలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆంగ్ల భాష పాఠకులకు హార్ట్ ల్యాంప్ నిజంగానే కొత్త అనుభూతిని ఇస్తుందని పోర్టర్ చెప్పారు.
1990 నుంచి 2023 వరకు ఈ కథా సంకలనం రాశారు. ఆ కథలను అత్యుద్భుతంగా దీప అనువాదం చేశారు. చిన్న పట్టణాలకు చెందిన జీవితాలను ఆ కథల్లో మలిచిన తీరు ఎంతో చమత్కారంగా ఉంటాయని విశ్లేషకులు చెప్పారు. బూకర్ ప్రైజ్ కింద 50 వేల పౌండ్లు ఇవ్వనున్నారు. రచయిత భాను ముస్తాక్, ట్రాన్స్‌లేటర్ దీప ఆ అవార్డు నగదును పంచుకుంటారు.
బూకర్ ప్రైజ్‌ను అందుకోవడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు భాను తెలిపారు. ఒక వ్యక్తిగా కాకుండా అనేక మంది స్వరాలను తన కథల ద్వారా వినిపించినట్లు చెప్పారు. బూకర్ ప్రైజ్‌ను రెండో సారి గెలిచిన భారతీయ రచయితగా భాను నిలిచారు. 2022లో టాంబ్ ఆఫ్ సాండ్ రాసిన గీతాంజలి శ్రీకి బూకర్ పురస్కారం దక్కంది. గీతాంజలి హిందీ భాషలో తన రచన కొనసాగించారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?