
పాకిస్తాన్‌కు “సైనిక మద్దతు” ఇస్తున్నందుకు తుర్కియేకు వ్యతిరేకంగా స్వదేశీ జాగరణ్ మంచ్ శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. భారత సైనికులకు సంఘీభావంగా, జాతీయ ప్రయోజనాల కోసం టర్కిష్ ఉత్పత్తులు, సాంస్కృతిక ఎగుమతులు, ఆ దేశానికి ప్రయాణాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలోని తుర్కియే రాయబార కార్యాలయం సమీపంలో ఈ నిరసన జరిగింది.
స్వదేశీ జాగరణ్ మంచ్ కార్యకర్తలు ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ “టర్కిష్ ప్రతిదాన్ని బహిష్కరించండి” అని భారతీయులకు విజ్ఞప్తి చేశారు. “భారత దేశభక్తిగల పౌరులు మన సైనికులకు (జాతీయ ప్రయోజనాల కోసం) సంఘీభావంగా టర్కిష్ ఉత్పత్తులు, ప్రయాణ – సాంస్కృతిక ఎగుమతులను బహిష్కరించాలని కోరారు.
“మన శత్రువులకు అధికారం ఇచ్చే దేశాలపై వ్యూహాత్మక ఆధారపడటం కంటే స్వావలంబనను ఎంచుకుందాం” అని ఆ సంస్థ జాతీయ సహ-కన్వీనర్ అశ్వని మహాజన్ తెలిపారు. నిరసనకారులను ఉద్దేశించి మహాజన్ సంతోషం వ్యక్తం చేస్తూ, “జాతీయ భద్రత ప్రయోజనాల కోసం” తక్షణమే అమలులోకి వచ్చేలా తుర్కియే సెలెబి యూనిట్ అయిన సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా గ్రౌండ్-హ్యాండ్లింగ్ కంపెనీ భద్రతా అనుమతిని రద్దు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అంతకు ముందు, స్వదేశీ జాగరణ్ మంచ్ బుధవారం ప్రభుత్వాన్ని ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించాలని, పౌర విమానయాన సంబంధాలను నిలిపివేయాలని, అవుట్‌బౌండ్ పర్యాటకాన్ని నిరుత్సాహపరచాలని, పాకిస్తాన్‌తో దాని “అపవిత్ర పొత్తు” కారణంగా తుర్కియేతో దౌత్య సంబంధాలను తిరిగి అంచనా వేయాలని కోరింది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు