
ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో నవంబరు 25న ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించగా, ఆయనపై ఆందోళనకారులు దాడి చేశారు. మరో సీనియర్ న్యాయవాది కేసును టేకప్ చేయగా, ఆయనపైనా కూడా బెదిరింపులకు పాల్పడ్డారు.
దీంతో చిన్మయ్ కేసును వాదించేందుకు ఎవరూ ముందుకురాలేదు. చివరకు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ క్రమంలోనే ఆయనకు ఊరట లభించింది. ఇటీవల కృష్ణదాస్‌కు బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, తాజాగా మరో కేసులో అరెస్ట్ చేయడం జరిగింది.
కాగా, షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన దగ్గరి నుంచి భారత్- బంగ్లా మధ్య సంబంధాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు కూడా అందుకు ఓ కారణమైంది.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?