పాక్ ఉత్పత్తులపై నిషేధంతో కళ్ళు ఉప్పు ఆర్డర్స్ రద్దు

పాక్ ఉత్పత్తులపై నిషేధంతో కళ్ళు ఉప్పు ఆర్డర్స్ రద్దు

పహహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ నుంచి దిగుమతులను భారత ప్రభుత్వం నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. రాక్‌సాల్ట్‌, డ్రై ఫ్రూట్స్‌ సహా పలు ఉత్పత్తులు దిగుమతి అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున రాక్‌ సాల్ట్‌ ఆర్డర్స్‌ను రద్దు చేశారు. కొత్తగా పాక్‌కు ఆర్డర్‌ ఇవ్వడం ఆపేశారు.  చాంబర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌కు చెందిన అశోక్ లాల్వానీ మాట్లాడుతూ రాక్ సాల్ట్ (కల్లుప్పు) ఉప్పు, ఖర్జూరం, నల్ల ఎండుద్రాక్ష, సబ్జా సీడ్స్‌ పాకిస్తాన్ నుంచి దిగుమతి దిగుమతి చేసుకుంటున్నట్లు అంజూర పండ్లు, ఎండుద్రాక్షలు పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకుంటాయని తెలిపారు. 

ప్రతి నెలా 250 నుండి 300 టన్నుల రాక్ సాల్ట్, 550-600 టన్నుల ఖర్జూరం, 15 టన్నుల పిస్తా-నల్ల ఎండుద్రాక్ష, సబ్జా సీడ్స్‌ వ్యాపారం జరుగుతుందని చెప్పారు. పాకిస్తాన్ నుండి దిగుమతులపై నిషేధం కారణంగా, టోకు వ్యాపారులు ప్రస్తుతానికి పెద్ద మొత్తంలో రాక్ సాల్ట్ ఆర్డర్‌లను రద్దు చేశారు. కొత్త ఆర్డర్‌లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.  హిందువులు ఉపవాసం ఉండే సమయాల్లో ఈ ప్రత్యేకమైన ఉప్పును వాడుతారు. ఈ ఉప్పును కల్లుఉప్పు, హిమాలయన్‌ స్టాల్‌ పేరుతో పిలుస్తుంటారు. ఈ ఉప్పు పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు దిగుమతి అవుతుంది. ఏళ్లుగా భారత్‌ ఈ ఉప్పును చౌకగా దిగుమతి చేసుకుంటూ వస్తుంది. ఈ ఉప్పుని శుద్ధి చేయరు. 

ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ మూడు అంశాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రాక్‌ సాల్ట్‌ని సేంధా నమక్‌గా పిలుస్తారు. సింధు ప్రాంతం వస్తున్నందున ఆ పేరు వచ్చింది. పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి వస్తుందున లాహోరీ ఉప్పు అని సైతం పేరుంది.