వికసిత్‌ భారత్‌ గ్రోత్‌ ఇంజిన్‌గా అమరావతి

వికసిత్‌ భారత్‌ గ్రోత్‌ ఇంజిన్‌గా  అమరావతి
 
ఆంధ్రప్రదేశ్‌ను అధునాతనప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని చెబుతూ అమరావతిని వికసిత్‌ భారత్‌ గ్రోత్‌ ఇంజిన్‌గా మార్చాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. రాజధాని అమరావతి పున: నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తూ  ఎన్టీ రామారావు కలలుగన్న `వికసిత్ ఆంధ్ర ప్రదేశ్’ సాధనకు అమరావతి నగరం నిర్మాణం ఆలంబనమైతే, అమరావతి నిర్మాణం తమ ప్రభుత్వం వికసిత్ భారత్ ఆశలు కార్యరూపం సాధించేందుకు ఓ గేమ్ చేంజర్  వంటిదని తెలిపారు.
 
“ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు.. ఎపి ప్రగతికి, వికసిత్‌ భారత్‌కు నిదర్శనం. అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోంది. స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. అమరావతి ఒక నగరం కాదు.. అమరావతి ఒక శక్తి. ఒక కొత్త అమరావతి.. కొత్త ఆంధ్రప్రదేశ్‌. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నా” అని తెలిపారు.
“రికార్డు స్పీడ్‌లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుంది. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది. రాజధాని అమరావతి ఏపీ ఆశలు, వికసిత్ భారత్ ఆశలు.. స్వర్ణాంధ్రకు బీజం. ఏపీని అధునాతన రాష్ట్రంగా మార్చబోతోంది అమరావతి. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి.” అని చెప్పుకొచ్చారు.

“అమరావతి స్వప్నం సాకారమవుతోంది. చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చుతోంది. దుర్గాభవానీ కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇది. ఇప్పుడు నేను ఈ పుణ్యభూమిపై నిలబడి ఉన్నాను.” అని తన ప్రసంగంలో ప్రధాని వెల్లడించారు.

“ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉంది. ఇవి శంకుస్థాపనలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. రికార్డు స్పీడ్‌లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుంది. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది” అని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. 

గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని తనకు గమనించానని, దాని గురించి తనకు చెప్పారని తెలుపుతూ భారీ ప్రాజెక్టులను సత్వరం, నాణ్యతతో పూర్తి చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. .

“అమరావతి స్వప్నం సాకారమవుతున్నట్లు కనిపిస్తోంది. చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు గోచరిస్తోంది. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్. దుర్గాభవానీ కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇది. ఇప్పుడు నేను ఈ పుణ్యభూమిపై నిలబడి ఉన్నాను. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉంది” అని మోదీ తెలిపారు.

గత పదేళ్లలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందని చెబుతూ ఎపిలో కనెక్టవిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోందని చెప్పారు. తక్కువ సమయంలో తమ పంటను తీసుకెళ్లడమనేది పర్యాటకం, తీర్థయాత్ర, తదితర రంగాలకు కూడా ఉపయోగపడుతుందని, హైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందని ప్రధాని వివరించారు.

 
“అమృత్‌ భారత్‌ కింద చాలా రైల్వే స్టేషన్లను ఆధునీకరించాం. సాగునీరుకు ఇబ్బంది లేకుండా నదుల అనుసంధానం చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి అయ్యేందుకు సహకరిస్తాం. పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి సహకారమందిస్తాం. శ్రీహరికోట నుండి జరిగే ప్రయోగాలు, దేశం మొత్తాన్ని గర్వపడేలా చేస్తున్నాయి” అని ప్రధాని వివరించారు. 
 
రోడ్ల నిర్మాణం వల్ల రైతులు, ఉద్యోగులు, సామాన్యులకు ప్రయోజనం కలుగుతుందని చెబుతూ రైతులకు ఎలాంటి సమస్య ఉండకూడదనేది తమ ప్రభుత్వ లక అని తెలిపారు. 2009-14 వరకు ఉమ్మడి ఎపికి రూ.900 కోట్ల కంటే తక్కువ రైల్వే బడ్జెట్‌ ఉండేదని, ఇప్పుడు ఒక్క ఎపి రైల్వే బడ్జెట్‌ రూ.9 వేల కోట్లపైనే ఉందని ప్రధాని చెప్పారు.  విశాఖలో ఏక్తామాల్‌  హస్తకళల నిపుణులకు చేయూతనిస్తుందని తెలిపారు.