అమృతసర్ సరిహద్దులో ఉగ్రకుట్ర భగ్నం

అమృతసర్ సరిహద్దులో ఉగ్రకుట్ర భగ్నం
భారత్- పాకిస్థాన్ సరిహద్దు అమృత్‌సర్‌లో ఉగ్రకుట్రను బీఎస్ఎఫ్ బలగాలు, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భగ్నం చేశారు. ముఖ్యంగా అక్కడ పెద్ద ఎత్తన ఆయుధాలు పట్టుబడ్డాయి. వీటిలో తుపాకులు, గ్రనేడ్లు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 
 
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలోనే సరిహద్దులో ఉగ్రకుట్ర భగ్నమై, భారీ ఎత్తున ఆయుధాలు పట్టుబడడంతో కలకలం రేగుతోంది. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ వింగ్ సమాచారం మేరకు పంజాబ్ పోలీసులు, బీఎస్ఎఫ్ బలాగలు ఆపరేషన్ నిర్వహించాయి.
 
దానిలో భాగంగానే ఉగ్రకుట్నను భగ్నం చేశాయి. అక్కడే వీరికి పెద్ద ఎత్తున ఆయుధాలు దొరికాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు పోలీసులకు అప్పగించారు. దీనిపై తదుపరి దర్యాప్తు నిర్వహించబోతున్నారు. అయితే బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు అత్యంత వేగవంతంగా, సమన్వయంతో వ్యవహరించడం వల్ల ఈ ఉగ్రకుట్ర భగ్నం అయినట్లు తెలుస్తోంది.

బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో భాగంగా అమృత్‌సర్ జిల్లాలోని సదరు గ్రామం నుండి రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లతో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్  అధికారి ఒకరు తెలిపారు. భరోపాల్ గ్రామం సమీపంలో ఈ ఆపరేషన్ జరిగింది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఆరు మ్యాగజైన్‌లతో మూడు పిస్టళ్లు ఇంకా 50 లైవ్ రౌండ్లు ఉన్నాయి.

 
“పంజాబ్ పోలీసులతో వేగంగా సమన్వయం చేసుకోవడం వల్లే ఒక పెద్ద ఉగ్రవాద ఘటన జరగకుండా నిరోధించాం” అని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. గత వారం రోజుల్లో భారత అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భారీగా పట్టుబడ్డ ఆయుధాలు, పేలుడు పదార్థాల రికవరీలలో ఇది ఒకటి. కొన్ని రోజుల క్రితం, అమృత్‌సర్‌లోని సహోవాల్ గ్రామంలో ఇలాంటి ఉమ్మడి ఆపరేషన్‌లో ఐదు హ్యాండ్ గ్రెనేడ్‌లు, 4.50 కిలోల ఆర్‌డిఎక్స్, నాలుగు పిస్టళ్లు, 220 రౌండ్లు, రెండు రిమోట్ కంట్రోల్‌లు, బ్యాటరీ ఛార్జర్ స్వాధీనం చేసుకున్నారు.