
పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్‌ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టును విశాఖ నగర పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ఇన్వెస్టమెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రూ.60 లక్షల విలువైన క్రిఫ్టో కరెన్సీని పోలీసులు సీజ్ చేసిన్నల్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.
వీరికి సహకారం అందిస్తున్న 16 మందిని అరెస్టు చేశారు. నిందితులు అమాయకుల చేత 132 ఖాతాలు తెరిపించినట్లు పోలీసులు తేల్చారు. బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 200 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖకు చెందిన ఓ వ్యక్తి రుణయాప్ ద్వారా గతేడాది రూ.3,200 తీసుకుని తిరిగి చెల్లించినప్పటికీ సైబర్ నేరగాళ్లు వేధింపులు ఆపలేదు.
దీంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతరం మృతుడి భార్య ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడి వాట్సాప్‌కు వచ్చిన బెదిరింపులను పరిశీలించిన పోలీసులు పాకిస్థాన్ ఐపీ అడ్రస్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. లావాదేవీలు అసోం, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయని నిర్ధరించారు.
దీంతో పోలీసు బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపించి ఆయా బ్యాంకు ఖాతాలు తెరిచిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఇదే కేసులో కర్నూలుకు చెందిన ఆర్. శ్రీనివాసరావును అరెస్టు చేసి విచారించగా 30 బ్యాంకు ఖాతాలు సైబర్ నేరగాళ్లకు అందించి రూ.12 లక్షలు తీసుకున్నట్లు అంగీకరించారని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు. లోన్ యాప్ మోసం కేసులో మూలాలు పాకిస్తాన్, చైనాల్లో వున్నట్లు గుర్తించారు
అనధికారిక లోన్ యాప్ నుంచి రుణాలు తీసుకున్న బాధితులు సైబర్ నేరగాళ్ల బెదరింపులకి భయపడి చేసే చెల్లింపులు 61 ఎకౌంట్లకు వెళుతున్నట్లు గుర్తించారు. బ్యాంక్ ఎకౌంట్ను వాడుకునేందుకు ఒక కోటి రూపాయల మేర జరిపే వ్యవహారాలకు గాను ఒక లక్ష 60 వేల రూపాయల కమిషన్ ఇస్తున్నట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలను విక్రయంతో సాంబశివరావుకు దాదాపు 4.5 కోట్ల వరకు కమీషన్ చేతికి వచ్చినట్లు గుర్తించారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ