ప‌రువున‌ష్టం కేసులో మేధా పాట్క‌ర్ అరెస్టు, విడుదల

ప‌రువున‌ష్టం కేసులో మేధా పాట్క‌ర్ అరెస్టు, విడుదల
న‌ర్మ‌దా బ‌చావో ఆందోళ‌న్ నేత‌, సామాజిక కార్య‌క‌ర్త మేధా పాట్క‌ర్‌ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవ‌ల ఆమెపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయింది.  24 ఏళ్ల నాటి పరువునష్టం కేసులో ప్రొబేషన్ బాండ్లు సమర్పించనందుకు సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌పై ఒక కోర్టునాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్‌బిడబ్లు)ను జారీ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.
కోర్టు ఆదేశాల మేరకు రూ. లక్ష జరిమానా చెల్లించడంతో సాయంత్రం 4:30 గంటలకు మేథా పాట్కర్‌ విడుదలయ్యారు.  రెండు రోజుల తర్వాత శుక్రవారం ఆమెను ఢిల్లీలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆ కేసు దాఖలు చేశారు. ఒక పోలీస్ బృందం శుక్రవారం ఉదయం ఈశాన్య ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని పాట్కర్ నివాసానికి వెళ్లి ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. 
“మేము ఎన్‌బిడబ్లును అమలు చేశాం, మేధా పాట్కర్‌ను అరెస్టు చేశాం” అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ (ఈశాన్య) రవి కుమార్ సింగ్ చెప్పారు. ఆ నేరానికి అరెస్టు అవసరం లేదంటూ అదనపు సెషన్స్ జడ్జి (ఎఎస్‌జె) ఈ నెల 8న పాట్కర్‌కు ఒక ఏడాది ప్రొబేషన్‌ను మంజూరు చేశారు.  నర్మదా బచావో ఆందోళన్ (ఎన్‌బిఎ) నాయకురాలిగా ఆమె చేసిన కృషిని, ఆమె పలు అవార్డుల గ్రహీత అని ఎఎస్‌జె ఉటంకించారు. ఆయన ఉత్తర్వు ప్రకారం, పాట్కర్ ఈ నెల 23 కల్లా ప్రొబేషన్ బాండ్లను సమర్పించవలసి ఉంది.
 
ఈ నెల 8న జరిగిన ఈ కేసు విచారణలో మేథాప్కాటర్‌ 23వ తేదీన కోర్టుకు హాజరుకావాలని, ప్రొబేషన్‌ బాండ్లు, రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించారు. 70 ఏళ్ల మేథాపాట్కర్‌ ఆ రోజున కోర్టుకు హాజరుకాలేకపోయారు. దీంతో జడ్జి పాట్కర్‌కు నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ చేశారు.